2023-05-28 17:37:41 by ambuda-bot

This page has not been fully proofread.

అర్థములిచ్చే మంత్రములతో నాలుగు దిశలకు ఆయా
దిశాధిపతులకు నమస్కరిస్తూ, ఊర్థ్వదిశను సంభావిస్తూ
పంచశిఖలను మూడేసి దర్భలనుంచి కత్తిరించి,
నలుదిశలయందు అభిమంత్రించిన కత్తితో వపనము చేసి,
'ఉప్వాయకేశాన్' అనే మంత్రంతో వానిని మేడిచెట్టు
మొదట లేదా దానికి ప్రతినిధిగా ఉంచిన దర్భకూర్చము
వద్ద ఆ కేశాలనుంచాలి.
 

 
పంచదిశల కనుగుణంగా పంచశిఖలనుంచడం
ఒక ఆచారం. 'పంచశీర్హోపనయనే జపే వినియోగః'
అని పంచశీర్షమైన గాయత్ర్యుపదేశాంగంగా ఆ
శీర్షములకు ప్రతీకలుగా పంచశిఖలుంచినట్లు కొందరి
భావన. ఉపనయన సూత్రం మాత్రం 'యథార్షి శిఖాని
దధాతి' అనగా వటువు యొక్క గోత్ర ఋషుల సంఖ్యను
బట్టి శిఖలను ధరింపచేయాలని సూచించింది. ఇలా
సూచిస్తూనే 'యథైవైషాం కులధర్మః స్యాత్' అని
వెసులుబాటును కూడా సూచించింది. ఇది మా
కులాచారమంటూ నేడు అందరూ పంచశిఖల
 
25
 
ఆగ్నేయం వరకు 'అఘారావాఘారయతి' అను
వచనాన్ననుసరించి అఘారహోమాలను చేస్తాడు.
7. అశ్మారోహణము : (సన్నికల్లుతాతిని తొక్కించుట)
అఘారాఘారమైన పిమ్మట 'ఆయుర్దా' మంత్రోచ్చారణ
పూర్వకంగా పాలాశసమిధతో హోమం చేయించి,
అగ్నిహోత్రమునకు ఉత్తర దిశగా ఉంచబడిన సన్నికల్లు
తాతిని వటువు కుడికాలిచే 'ఆతిష్టేమ మశ్మాన మశ్మేవ
త్వగ్ స్థిరోభవ'అని చెప్పి త్రొక్కిస్తారు. ఈ తాతిని అధిష్ఠించి
దీనివలెనే అచలనిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించాలనే
సందేశం ఈ మంత్రంలో అనుగ్రహింపబడినది.
8. వస్త్రాజిన మౌంజీమేఖలాదండాదిధారణము :
శీతవాతోష్ణోపశమన ద్వారా దేహాలంకరణార్థమై
ఆభరణముగా అంటే అలంకారము వలె శరీరమునకు
శోభనిచ్చే వస్త్రాలంకారములను, కృష్ణాజినము, ముంజ
త్రాటితో పేనబడిన మేఖల అనగా మొలత్రాడును ఆ
అశ్మ అనగా సన్నికల్లుతాతిపై నుంచినవానిని ప్రోక్షించి
ఆచార్యుడు వటువునకు కట్టబెడతాడు.
 
27
 
నుంచుతున్నారు. కొందరు సంస్కారమాత్రంగా కత్తెరవేసి
వపనం చేయించకుండా శిఖలను ఉంచకుండా
ఉపనయనం చేసేస్తున్నారు. వారికో నమస్కారం!
శిఖాయజ్ఞోపవీతములు లేకుండా చేసిన కర్మ
నిరర్థకమవుతుందని ముందే చెప్పుకున్నాం.
6. అగ్న్యుపధానము :
 
అనగా అగ్నిహోత్రునభ్యర్చించుట అని భావము. వటువు
శిఖోపవీతియై చేసే కర్మకాండ అంతా ఇక్కడి నుండి
ప్రారంభమవుతుంది. కావున ఇట నుండి అసలైన
ఉపనయన కార్యక్రమము ఆరంభించబడుతుందని
గ్రహించాలి. ఈ అగ్న్యాధానాది ఉపనయన కర్మకు
అనువైన దర్భలు, ఉదకములు, కూర్చ, వస్త్రము, అశ్మ
(సన్నికల్లుతాయి) పాలాశదండము, కృష్ణాజినము,
మౌంజీమేఖలను ముందుగా సమకూర్చుకుని ఆచార్యుడు
'చత్వారిశృంగాః' అనే మంత్రాన్ని చదువుతూ అగ్ని
భట్టారకుని ప్రార్థించి షట్పాత్రప్రయోగాన్ని ఆచరిస్తాడు.
తరువాత ప్రజాపతిని ధ్యానిస్తూ వాయవ్యము నుండి
 
26
 
మంత్రముచే పవిత్రీకృతమై ఆచార్యునిచే మూడు
చుట్టలుగా చుట్టబడిన ఆ మౌంజీమేఖల ప్రాణాపాన
వాయువులకు పుష్టిని కూర్చి వటువు యొక్క ఆయుష్షును
వీర్యమును సంరక్షిస్తుంది. దుష్ట ప్రసంగములను
నిర్మూలిస్తూ అతడు సంచరిస్తున్న గృహప్రదేశాన్నంతను
పవిత్రము చేస్తుంది. 'మిత్రస్యచక్షుః' అనే మంత్రముచే
సంస్కరింపబడి ఉత్తరీయముగా ధరింపచేయబడిన
కృష్ణాజినము (జింకచర్మము) వటువు యొక్క తేజస్సు,
ఓజస్సు, వర్చస్సులను వృద్ధిపరుస్తుంది.
 
9. ఆచార్యుడు వటువును స్వీకరించుట మఱియు
అగ్న్యాది దేవతలకు వప్పగించుట :
 
ఈ విధముగా మంత్రములచే సంస్కరించబడిన
నూతనవస్త్ర కృష్ణాజిన, మౌంజీ మేఖలాలంకృతుడైన
వటువును ఆచార్యుడు... 'అగ్నిస్తే హస్తమగ్రహీత్'
మొదలుగా గల దశ మంత్రములతో కుమారుని కుడిచేతిని
పట్టుకుని స్వయముగా కుమారుని స్వీకరించి ఆతని రక్షణ
బాధ్యతను మరల ఆ అగ్న్యాది దశదేవతలకే వప్పగిస్తాడు.
 
28