2023-05-28 17:37:41 by ambuda-bot

This page has not been fully proofread.

కర్మలతో సమానము. వానివల్ల దివ్యత్వము సిద్ధించదు
సరికదా ఆసుర లక్షణాలు ప్రాప్తిస్తాయి. కావున
ఉపనయనసంస్కారం పొందినది మొదలు జీవిత
పర్యంతము సదా యజ్ఞోపవీతమును ధరించాలి.
 
ఉపనయన సంస్కారమైనది మొదలు మన
శరీరంలో మంత్రశక్తి సదా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ
శరీరం ఒక ఛార్జింగ్ బ్యాటరీ అనుకుంటే, దీనికి ఛార్జర్
యజ్ఞోపవీతం. విద్యుత్తు గాయత్రీమంత్రానుష్టానం.
ఉపవీతియై నిత్యమంత్రానుష్ఠానం ద్వారా ఈ దేహం
దివ్యశక్తితో ముప్పొద్దులా రీఛార్జ్ అవుతూ శక్తిమంతమై
అనుదినము దివ్యత్వాన్ని పెంపొందించుకుంటూ తుదకు
బ్రహ్మీభూతమైపోతుంది. ఇదీ యజ్ఞోపవీత మాహాత్మ్యం!
యజ్ఞోపవీతాలను ఎవరెవరెన్నింటిని ధరించాలి?
యజ్ఞోపవీతముగా ఒక ముడిని మాత్రం బ్రహ్మచారి
ధరించాలి. 'వటోరేకం-గృహస్థస్య ద్వే' అని శాస్త్రం.
గృహస్థులు, వానప్రస్థులు కూడా రెండు ఉపవీతాలను
ధరిస్తే సరిపోతుంది. 'యజ్ఞోపవీతే ద్వే ధార్యే శ్రాతే స్మార్తే
 
21
 
చేసిన పిమ్మట, యజ్ఞోపవీతమును ధరించాలి. నాలుగు
మాసములు గడిచినను జీర్ణోపవీతాన్ని విడిచిపెట్టి నూతన
యజ్ఞోపవీతాన్ని ధరించాలి. (యజ్ఞోపవీతధారణవిధి
చివరిపేజీలో 58లో నున్నది)
 
3. నాందీ సమారాధనం :
 
యజ్ఞోపవీతధారణమైన పిమ్మట వటువు యొక్క
ఆయుష్యాభివృద్ధ్యర్థమై నాందీ శోభన దేవతలను
ఆహ్వానించి బ్రాహ్మణ సమారాధన చేయాలి. దీనిలో
పాపవిమోచకుడు, అంగిరసుడు, గయుడు, ఆత్రేయుడు,
తార్క్ష్యుడు అనువారినర్చించి మహావిష్ణుస్వరూపులైన
బ్రాహ్మణోత్తములను గంధాక్షతలతో అర్చించి వారికి
యథాశక్తి దక్షిణ, వస్త్ర తాంబూలాదులను సమర్పించాలి.
ఈ సమారాధన నేడు బ్రహ్మచారులకు జఱుపుట
 
ఆచారముగా పరిణమించినది.
 
4. లఘుభోజనం :
 
'కుమారభుక్తికాలేతు గాయత్రీం సముదాయయన్'
బ్రహ్మచారులతో పంక్తి భోజనం పెట్టేటపుడు ఆచార్యుడు
 
23
 
చ కర్మణి' అని శాస్త్రం. శ్రాతకర్మాధికార సిద్ధికోసం ఒకటి
స్మార్త కార్మధికార సిద్ధి కోసం మఱియొకటి రెండు ధరిస్తే
చాలు, శ్రాతస్మార్తాది నిఖిల నిత్యకర్మానుష్ఠాన సిద్ధ్యధికారం
లభిస్తుంది. వస్త్రాభావదోష పరిహారార్థం మూడవ
యజ్ఞోపవీతాన్ని ఆచారంగా ధరిస్తున్నారు. ఉత్తరీయార్థం
నాలుగవది, అయిదవది యజ్ఞాధికారార్థమని, ఇలా 5
ఉపవీతాలను సమాహారంగా ధరిస్తున్నారు. మూడు
ముడులకన్నా ఎక్కువగా ఉపవీతమును ధరించనవుసరం
లేదు. యతులకు, సన్న్యాసులకు ఉపవీతం ధరించాలనే
విధి వర్తించదు. 'నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో విధిః
కోనిషేధః - అని శాస్త్రం కాగా త్రిగుణాతీతులు కావున
వారికి యజ్ఞోపవీత ధారణ విధి కూడా వర్తించదని
 
భావం.
 
నూతన యజ్ఞోపవీతాన్నెప్పుడు ధరించాలి?
 
జాతాశౌచ మృతాశౌచము (పురుడు మరియు మైల)
శుద్ధి దినములలోను, గ్రహణానంతర స్నానము (విడుపు
స్నానము) తరువాత, శ్మశానమునకేగి తిరిగివచ్చి స్నానము
 
22
 
స్వయంగా అన్నాన్ని గాయత్రీమంత్రంతో ప్రోక్షించి
వటువుచే క్షారలవణవర్ణ భోజనమును (ఉప్పు, కారం
లేకుండా) 'మాత్రాచ సహభోజనమ్' హోమాదులకు
పూర్వాంగంగా తల్లితో సహపంక్తి భోజనం చేయించాలి.
ప్రస్తుతం ఈ ఆచారం తోబుట్టువు (అక్కచెల్లెలు)తో
సహపంక్తి భోజనంగా మన ఆంధ్ర దేశంలో వ్యవహారంలో
 
ఉంది.
 
వటువును 'లఘ్వాశీః' అను ప్రవచన ప్రకారం
కొద్దిగా భుజింపచేసి, సహపంక్తి భోజనం చేసిన సోదరికి,
సబ్రహ్మచారులకు (పసుపు, పొత్తములు) పసుపులో
ముంచిన వమ్రులను బహూకరించే పరిపాటి కనిపిస్తుంది.
తరువాత శరీర శుద్ధ్యర్థం పుణ్యాహవాచనం అటుపైన..
5. కేశవపనం :
 
ఆయుర్వృద్యై కేశవపనమ్ - ఉష్ణన వాయవిత్యాది
యజుర్మంత్రములచే సంస్కరించబడిన గోరువెచ్చటి
నీళ్ళతో తలను తడిపి వటువునకు ఆయుష్షు, వర్చస్సు,
యశస్సు, ఓజస్సు, మహస్సులు సంప్రాప్తించి వర్ధిల్లాలనే
 
24