2023-05-28 17:37:41 by ambuda-bot

This page has not been fully proofread.

కాగా యజ్ఞోపవీత ధారణ వల్ల సర్వక్యాజయం
లభిస్తుందని భావం.
 
ఒక సూత్రప్రమాణం 96 బెత్తలుంటుందని చెప్పుకున్నాం.
ఇది 96 సం॥ల కాలప్రమాణానికి ప్రతీక. మధ్యలో
ప్రసక్తమయ్యే అధికమాసాలతో కలిపి శతాయుః
ప్రమాణాన్ని శతం జీవ శరదో వర్ధమానః అని
అనుగ్రహిస్తుంది మంత్రపూతమైన ఈ యజ్ఞోపవీతం.
కాగా, యజ్ఞోపవీతం అపమృత్యువును వారించి,
పూర్ణాయుర్దాయాన్ని అనుగ్రహిస్తుందని భావం.
 
ఇందులోని 9 దారాలకు క్రమంగా ఓంకారము
లేదా ప్రణవము, అగ్ని, ఇంద్రుడు, సోముడు, పితరులు,
ప్రజాపతి, విష్ణువు, సూర్యుడు మిగిలిన సర్వదేవతలు
అధిదేవతలుగా (ఓంకార ప్రథమస్తన్తుః । ద్వితీయోగ్ని
స్తథైవచ । తృతీయోభగదైవత్యం । చతుర్థో సోమదేవకః ।
పంచమః పితృదైవత్యో । షష్టశ్చైవ ప్రజాపతిః । సప్తమో
వసుదైవత్యః ధర్మశ్చాష్టమ ఏవచ నవమః సర్వదైవత్యః
ఇత్యేతే నవ తస్తవః) అని చెప్పబడినారు.
 
17
 
తపోహరమ్' పొట్టిగా ఉంటే ఆయుష్షును, పొడుగ్గా ఉంటే
చేసిన తపస్సును హరిస్తుందట. అలానే 'యశో హరతి
వై స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్' లావుగా ఉంటే
కీర్తిని, మరీ సన్నగా ఉంటే ధనమును హరిస్తుందట.
 
అందుకని 'సిద్ధార్ధఫలమానంస్యాత్' నిర్ణీతమైన
ప్రమాణాలతో ధరించబడిన యీ యజ్ఞసూత్రం నిజంగా
దివ్యత్వాన్నే అనుగ్రహిస్తుంది. 'ఆకటేస్తత్ప్రమాణం స్యాత్'
అంటే ఎడమభుజముపై నుండి కటి (నడుము) వరకు
వ్యాపించి ఉండడమనేది దీనియొక్క ప్రమాణమని
స్థూలంగా తాంత్రికులు నిర్ణయించేరు. వారి పరిభాషలో
మూలాధారం నుండి బ్రహ్మరంధ్రము వద్ద గల
సహస్రారపర్యంతమైన కులమార్గము లేదా జ్యోతిష్పథము
ఈ సిద్ధార్థ ఫలమానంగా చెప్పబడింది. లలితా సహస్ర
నామాల్లో కూడా ఈ మార్గంగుండా ప్రయాణించే
చైతన్యశక్తి కుణ్డలిని గ్రంథిత్రయాన్ని భేదిస్తూ చేసే
ప్రయాణం 'మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ
మణిపూరాంతరుదితా విష్ణుగ్రందివిభేదినీ - ఆజ్ఞా
చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ, సహస్రారాం
 
19
 
ఈ విధంగా యజ్ఞోపవీతధారణం చేత సర్వకార్య
జయము, ఆయుర్వృద్ధి, అపమృత్యువినాశము లభిస్తాయి.
బ్రహ్మజ్ఞానం కూడా సాధకునికి లభిస్తుంది. 'బ్రాహ్మం
త్రైపూరుషంమహః' త్రిమూర్తుల యొక్క సమాహృత
మూలరూపమే బ్రహ్మము. దానికి సంబంధించిన జ్ఞానము
బ్రాహ్మము.
 
"జ్ఞానాత్మకేన హరిణా బ్రహ్మాత్మని శివే వ్యయే
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్
తద్గంధిమాశ్రితస్తారః త్రిమాత్రో నాద సంయుతః
తద్దంధ్యగ్రేచ సావిత్రీ వేదమాతా శివాజ్ఞయా ॥
 
అనగా యజ్ఞోపవీతము త్రిమూర్త్యాత్మకము. దాని
గ్రంథిని ఆశ్రయించి ఓంకారము గ్రంథ్యగ్రములో శివాజ్ఞచే
వేదమాతయైన గాయత్రి ఆశ్రయించి ఉంటాయని
శాస్త్రప్రవచనం.
 
ఈ యజ్ఞసూత్రము అదే 96బెత్తల ప్రమాణంలో
ఉండాలి. మరీ పొడుగ్గా ఉండకూడదు. అలాగని పొట్టిగా
ఉండకూడదు. 'ఆయుర్హరతిహ్రస్వం చాతిదీర్ఘం
 
18
 
బుజారూఢా సుధాసారాభివర్షిణీ' మొదలైన నామాల్లో
 
వివరించబడింది.
 
పవిత్రం పరమం శుద్ధం ఆయుష్యం చ శుభావహమ్
ఔజస్యం బ్రహ్మవర్చస్వం బ్రహ్మసూత్రం తథోదితమ్
 
యజ్ఞోపవీతం చాలా పవిత్రమైనది. ఆయుర్వృద్ధి
కరమైనది. శుభప్రదమైనది. ఓజస్సు, తేజస్సు, బ్రహ్మ
వర్చస్సులనిస్తుందని చెప్పబడింది. దీనిని అనునిత్యం
ధరించాలని శాస్త్రం. 'నిత్యోపవీతీస్యాత్త'ని స్మృతి వచనం.
'కాయస్థమేవధార్యం - నకదాచనోదరే' నేడు కొందరు
యజ్ఞోపవీతాన్ని నడుంకు చుట్టబెట్టుకుంటున్నారు. దానిని
ఎడమభుజముపైనే ధరించాలి. నడుమునకెప్పుడూ
బిగించరాదని అర్థం. 'దినమేకమపి యజ్ఞోపవీతముత్సృజ్య
శూద్రత్వమాప్నోతి' అంటే ఒక్కరోజైనా సరే ఉపవీతం
లేకుండా ఉండకూదు. ఉంటే గనుక వాడు శూద్రునితో
సమానం. ఇంకా 'విశిఖోనుపవీతశ్చ యత్కరోతి
తన్నిరర్థకం - సర్వమపికర్మాసురం భవతి' శిఖా
యజ్ఞోపవీతములను వర్ణించి చేసిన కర్మలన్నీ ఆసుర
 
20