This page has not been fully proofread.

9
 
అనుస్వారః - బిందువు; విసర్గః - విసర్గము; పరాశ్రితౌ
 
-
 

 
పరవర్ణ మునాశ్రయించి యుచ్చరింపఁబడు; ఒక పౌ= జిహ్వా
మూలీయోపధ్మానీయములు; దుఃస్పృష్టః - రెండచ్చులమధ్య
నుండుల కారము; ప్లుతః- ప్లుతమగు; ఇకార ఏవచ_ఇకారమును,
( నెరసి వీనియొక్క ఆరువది మూడరువదినాలు గులగుటను);
విజ్ఞేయః
 
తెలినది.
 
-
 

 
వ్యా:- పై ఁజెప్పబడిన వానిలో ప్లుత ఇకారము (ఇ-3)
ను గూడ గ్రహించిన యరువదినాలుఁగు వర్ణ ములగును.
అదానిని గ్రహింపకున్న నరువది మూడే యగును. అదెట్లన
'అ_ఇ_ఉ_ఋ'_లను నీ నాలుగును ప్రత్యేకముగా హస్వ
దీర్ఘ ప్లుత భేదము చే పండ్రెండును, ఏ_ఓ_ఐ_ఔలు దీర్ఘపుత భేద
ము చే నెనిమిది (ఏలస వానిలో హ్రస్వ భేదము లేదు.) యును,
హస్వకారముసు, వెరసి (12+8+1=21) యిరువది
యొక్క అచ్చులును; కకారాది మఠారా స్తములగుస్పర్శ
వర్ణము . లిరువదియైనును (25); య_ర_ల_వ_శ_ష_స-హ
యను యకారాది వర్ణము లెనిమిదియు (8); ఉక్తలక్షణ
లక్షితములగు యమాఖ్యవర్ణములు నాలుగును (4); అను
స్వార – విసర్గ - జిహ్వా మూలీయోపధ్మానీయ - దుఃస్పృష్టము
లయిదును (5); వెరసి-(21+25+8+4+5 = 63) అరువది
మూఁడు వర్ణములు తేలినవి. ప్లుతమగు ఇకారమునుఁగూడ
గణించినచో నా మొ త్తమరువదినాలుఁగునకు హెచ్చును.
* కాదయోమావసానా ఃస్పర్శాః (సిద్ధాన్తకౌముది).