This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
ఇతరులు సాయంకాలములో వైష్ణవిగా గాయత్రీస్వరూపాన్ని-
సాయాహ్నే విష్ణురూపాం తాం తారస్థాంపీతవాససామ్ ।
సూర్యమండలమధ్యస్థాం సామవేదస్వరూపిణీమ్॥-అని ధ్యానించి
'యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః॥
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే॥ అనే
శ్లోకమంత్రాన్ని 10 పర్యాయములకు తక్కువ కాకుండా జపించాలి.
మరియు 'శ్రీం విష్ణవే సూర్యాయ సాయంసంధ్యాయై నమః' అనే
సంధ్యాగాయత్రీ మంత్రాన్ని కూడా జపించాలి. యథాశక్తి28/108/
1008సంఖ్యలో జపించి తరించవచ్చు. సంఖ్యకన్నా శ్రద్ధాభక్తులు
ప్రధానము. జపము పూర్తయిన పిమ్మట 'అనేన మయా యథాశక్తికృతేన
సంధ్యా/గాయత్రీజపేన శ్రీగాయత్రీ పరాదేవతా సుప్రీతా సుప్రసన్నా
వరదాభవతు' అని అక్షతలను నీళ్ళను పళ్ళెంలో సమర్పణభావంతో
విడిచిపెట్టాలి.
 
41
 
దిగ్దేవతానమస్కారము
 
ప్రతీచ్యై దిశే నమః– ప్రతీచీదిగ్దేవతాభ్యో నమః (పడమరదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
దక్షిణాయై దిశే నమః– దక్షిణదిగ్దేవతాభ్యో నమః। (దక్షిణదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ప్రాచ్యై దిశే నమః– ప్రాచీదిగ్దేవతాభ్యో నమః (తూర్పుదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ఉదీచ్యై దిశే నమః– ఉదీచీదిగ్దేవతాభ్యో నమః (ఉత్తరదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ఊర్ధ్వాయై దిశే నమః-ఊర్ధ్వదిగ్దేవతాభ్యో నమః (ఊర్ధ్వదిక్కుకునమస్కరించాలి)
అధరాయై దిశే నమః-అధోదిగ్దేవతాభ్యో నమః (క్రిందుగానమస్కరించాలి)
అంతరిక్షాయై దిశే నమః-అంతరిక్షదిగ్దేవతాభ్యో నమః (ఆకాశదిశగానమస్కరించాలి)
దేవర్షిపిత్రాదులనమస్కారము
 
సర్వదేవతాభ్యో నమః॥ దేవేభ్యో నమః ఋషిభ్యో నమః మునిభ్యో నమః॥
గురుభ్యో నమః పితృభ్యో నమః॥ మాతృభ్యో నమః॥