ఒక ఆధునిక సంస్కృత గ్రంథాలయము

ప్రతిపదార్థ వ్యాఖ్యానంతో సంస్కృత వాఙ్మయం. అనేక నిఘంటువులతో సమగ్రపరచి అన్ని పరికరాలపై ఉచితంగా లభ్యం.

గ్రంథాలయానికి సుస్వాగతం

ప్రపంచంలో అతి పెద్ద సంస్కృత గ్రంథాలయము సిద్ధమౌతోంది

సంస్కృత గ్రంథాలు అందరికీ అందుబాటులో లేవు. కొన్ని అంతర్జాలంలో, మరి కొన్ని పుస్తకాలలో, మరెన్నో రాతపత్రాలలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి స్థితిగతులు వేర్వేరు రకాలుగా ఉండటం సంస్కృతాధ్యయనపరులకు నిరుత్సాహకరంగా ఉంది.

అందుకే మేము అంబుద అనే పరిపూర్ణ గ్రంథాలయం నిర్మాణానికి పూనుకున్నాము. ఇప్పుడు మా గ్రంథాలయం చిన్నదిగా మొదలైనా, అతివేగంగా పెరుగి త్వరలోనే ఒక మహత్తరమైన సంస్కృత గ్రంథాలయంగా విస్తరించబోతోంది.

అందరికీ అందుబాటులో

సంస్కృత గ్రంథాలు సర్వత్ర ఉచితం. ఇక్కడ సంస్కృతం శోభమయంగా, మనోహరంగా, అనువుగా మీ మాతృభాషలో చదవచ్చు.

మేము అంబుద అనే మహత్తర గ్రంథాలయ నిర్మాణ యజ్ఞం తలపెట్టి ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ఇప్పుడు అంబుద అన్ని సాంకేతిక పరికరాలపైనా పనిచేస్తోంది. త్వరలో అంగ్లంతో పాటు మరేన్నో భాషలలో అంబుదని చదవవచ్చు.

చురుకైన సాంకేతిక విజ్ఞానం

పదచ్ఛేదము, విగ్రహ వాక్యము, పదార్థోక్తి, లిపి పరివర్తనం, పలు నిఘంటువులను సమాకలినంచేసిన అత్యాధునిక గ్రంథాలయమే అంబుద.

మేము అంబుద నిర్మాణానికి ఇటీవలే శ్రీకారంచుట్టాము. అనువాదాలు, ప్రాచీన వ్యాఖ్యానాలు, పదాన్వేషన, పదబంధాలను సాంద్రపరచటం లాంటి సౌకర్యాలు పాఠకులకు ఒకే చోట సిద్ధం చేయటానికి పూనుకున్నాము.

ప్రజల చేత, ప్రజల కొరకు

అంబుదని ధనాపేక్షలేకుండా కార్యకర్తలే పరపూర్ణంగా నిర్వహిస్తున్నారు. యథాశక్తిగా మీరు ఇచ్చే సహకారం మాకు అత్యంతానన్దదాయకం. మీరు కూడా ఆసక్తితో అంబుద అభివృద్ధికి సాయపడటానికి ఈ link click చేయండి.

అంబుద అత్యంతవేగంగా వృద్ధి పొందుతోంది. మా email జాబితాలో చేరి నూతన గ్రంథాలు ఇతర విశేషాలు గురించి తెలుసుకోండి.

సంస్కృతం మీ అరచేతిలో

ఈ ప్రయాణంలో ఇదే మా మొదటి అడుగు. అంబుదకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.

గ్రంథాలయానికి సుస్వాగతం