2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

10. జీలకఱ్ఱ బెల్లం (సుముహూర్తం) :
'మంగళ ద్రవ్యాణి మంగళకరాణి భవేయుః అనగా పసుపు,
జీలకఱ్ఱ, బెల్లము, చెఱుకు, పాలు, నెయ్యి, గోరోచనము
మొదలగు మంగళ ద్రవ్యములన్నియు కలిపి నూరబడిన
యీ మంగళద్రవ్య సంచయము వటువునకు సమస్త
మంగళములను కలుగజేయుగాక! అని ఆచార్య
దంపతులాశీర్వదించి, లక్ష్మీనారాయణాది సర్వదేవతలకు,
సనక సనందాది సర్వఋషులకు, తిథి, వార నక్షత్ర
యోగకరణ, ముహూర్త లగ్నహోరాద్రేక్కాణ, నవాంశ,
ద్వాదశాంశాౄది సర్వజ్యోతిర్విషయములకు, సర్వగ్రహ
నక్షత్ర రాశిచయమునకు, స్వస్తివచనములను పలుకుతూ,
చూర్ణికను 'వటుంచతుర్వేద పటుం కరోతు' అనే
మకుటంతో మంగళాష్టకములను చదువుతూ,
సుముహూర్త సమయంలో జీలకఱ బెల్లం మొదలైన
ద్రవ్యములను నూరిన ముద్దను బ్రహ్మరంధ్రముపైనద్ది,
వటువును దగ్గరగా తీసికొని, ఆచార్యుడు నూతన
వస్త్రముచే తనను, వటువును కూడా ఆచ్ఛాదించి,
 
29
 
సమన్వితంగా మూడుపాదాలతో ఉపదేశించబడుతుంది.
దీనివలన వాక్శుద్ధి, ఓజస్సు, తేజస్సు, ఆయుష్షు, సంపద,
విద్య, ఒకటేమిటి సర్వమూ లభిస్తాయి. గాయత్రీ
మంత్రానుష్ఠానము వల్ల మనలోని బుద్ధి వికసించి,
ఆంతరమైన దివ్యచైతన్యం అత్యుజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.
ముప్పొద్దుల గాయత్రీ మంత్రాన్ని వేయిన్నెనిమిది (1008)
పర్యాయములు జపించే వ్యక్తి త్రిజగద్వంద్యుడౌతాడు.
అతడు అగ్నిసదృశ తేజస్వంతుడై బ్రహ్మేంద్రాది దేవతలకు
వంద్యుడౌతాడు. అతనిని సర్వకాల సర్వావస్థల యందు
వేదమాత గాయత్రి సంరక్షిస్తూ సర్వసంపత్సమృద్ధులను
అనుగ్రహిస్తుంది.
 
శాక్తసంప్రదాయంలో త్రిసంధ్యలయందును సూర్య
దేవతాకమైన గాయత్రీ దేవతను 'ఐం పరబ్రహ్మణే
సూర్యాయ ప్రాతస్సంధ్యాయై నమః' అని ప్రాతఃకాలంలో
బ్రహ్మాణిగా, క్లీం రుద్రాయ సూర్యాయ మాధ్యాహ్నిక
సంధ్యాయై నమః అని మధ్యాహ్నం రుద్రాణిగాను,
సాయంసంధ్యలో సౌః విష్ణవే సూర్యాయ సాయం
 
31
 
'సుప్రజా' అనే మంత్రాన్ని కుడిచెవిలో జపించి,
బ్రహ్మచర్యవ్రతమును పొందుచున్నావని అనుశాసించి,
అతనిచే 'బ్రహ్మచర్య మాగామ్' బ్రహ్మచర్య వ్రతమును
ప్రవేశించితిని - అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. వ్రతమును
ధరించిన వటువుచే యోగాది నవమంత్రములతోను
'చిత్తంచస్వాహా' మొదలైన 58 ఉపహోమాలను
చేయిస్తాడు.
 
11. గాయత్ర్యుపదేశము :
 
తరువాత ఆచార్యుడు సభకు నమస్కరించి
'గాయత్ర్యుపదేశస్య సుముహూర్తోస్త్వితి భవంతో బ్రువన్తు'
అని పెద్దల అభ్యనుజ్ఞను పొంది కుమారునకు మారుగా
స్వీకరించిన వటువునకు గాయత్రీ మంత్రాన్ని
ఉపదేశిస్తాడు. మనదేశాచారం ప్రకారం తండ్రి
కుమారునకు గాయత్రిని ఉపదేశిస్తాడు.
గాయత్రీ ప్రాశస్త్యము :
 
'నగాయత్ర్యాః పరం మంత్రమ్' గాయత్రిని
మించిన మంత్రము లేదు. ఇది చతుర్వింశత్యక్షర
 
30
 
సంధ్యాయై నమఃఅని వైష్ణవిగాను, యీ తల్లిని అర్చిస్తారు.
 
తరువాత పాలాశదండమును కుడిచేత పట్టించి
ఉభయవ్రత మంత్రాలను చెప్పించి గోదానం చేయించి
సూర్యదర్శనమును ఉపస్థానమంత్రపురస్సరముగా
చేయించిన పిమ్మట....
12. అగ్నికార్యము :
 
ఈ అగ్నికార్యం విషయంలో అగ్నికార్యం వటుః
కుర్యాత్ సంధ్యయోరుభయోరపి సాయమేవేత్యేకే - అంటే
వటువు ఉపనయన దీక్ష స్వీకరించినది మొదలు సంధ్యా
వందనము వలెనే ఉభయ సంధ్యలందు అగ్నికార్యం
కూడా చేయాలి అని, సాయంకాలం చేస్తే సరిపోతుందని
రెండు మతభేదాలున్నాయి. వీనిలో ఉభయ సంధ్యలందు
విధిగా అగ్నికార్యం కూడా చెయ్యాలన్నదే పలువురి
అభిప్రాయము. అనూచానంగా అందరూ అనుసరిస్తున్న
శిష్టాచారం. కాబట్టి ఉభయ సంధ్యల యందును
అగ్నికార్యం చేయాలి. దీనివల్ల సంపద, తేజస్సు, ఓజస్సు
లభిస్తాయి. అగ్నికార్యం చేయడానికి 15-20 నిముషముల
 
32