2023-05-28 17:37:40 by ambuda-bot

This page has not been fully proofread.

సంస్కారం విధాయకంగా చెప్పబడింది. వసంతకాలం
బ్రాహ్మణులకు నిర్దేశించబడింది. కారణం, అది ప్రశాంత
వాతావరణంలో వేదవిద్యాధ్యయనమునకు అనువైనది.
గ్రీష్మఋతువులో సూర్యతాపమధికంగా ఉంటుంది. అది
ప్రతాపమునకు చిహ్నము. కావున క్షత్రియులకు
నిర్దేశించబడినది. శరదృతువు వాణిజ్యమునకు అనువైన
కాలం. వాణిజ్యము ద్వారా సంపద్వృద్ధికి తోడ్పడుతుంది
అది వైశ్యులకు అభీష్టమైన సమయము. కావున ఆ
సమయము వైశ్యులకు నిర్దేశించబడినదని గ్రహించాలి.
ఉత్తరాయణంలో ఉపనయనం చేయడం మంచిది.
అందునా చైత్రవైశాఖ మాసములు ఉత్తమములు. మాఘ
ఫాల్గుణ జ్యేష్ఠమాసములు మధ్యమములు. ఉత్తరాయణము
లోనివే యైనను పుష్య, ఆషాఢమాసములు అధమములుగా
చెప్పబడినవి.
 
'గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత' అని బహు
వచనంగా ఆపస్తంబ గృహ్యసూత్రాల్లో బ్రాహ్మణునకు
గర్భాష్టమములయందు అనగా 7సం॥లకు అటునిటుగా
 
5
 
2. వేదాధ్యయనం వల్ల తేజస్సు, ఓజస్సు, వర్చస్సు,
యశస్సు, మహస్సు, జ్ఞానం సిద్ధిస్తాయి.
 
3. లోకంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
 
4. శ్రాతకర్మలయందధికారం లభిస్తుంది. బ్రహ్మచర్యం
వల్ల తేజస్సు, ఓజస్సు, జ్ఞానం, దినదినాభివృద్ధి
చెందుతాయి. క్రమంగా ద్విజత్వం తద్వారా దివ్యత్వం
సిద్ధిస్తాయి.
 
5. శ్రేయస్సులన్నింటికీ కారణభూతమైన గాయత్ర్యుపాసన
సంప్రాప్తిస్తుంది. అది బ్రహ్మవిద్య లేదా మోక్షవిద్యకు
మూలకారణమైనది. తద్వారా ఆత్మజ్ఞానము,
బ్రాహ్మీస్థితి జీవన్ముక్తి లభిస్తాయి. ఈ స్థితిని పొందడమే
మానవజన్మకు చరితార్థత.
 
6. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన,
ప్రతిగ్రహములకు అర్హత లభిస్తుంది. దీనివల్ల
ఆర్థికప్రయోజనంతో పాటు గౌరవప్రతిష్ఠలు ఆముష్మిక
ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
 
7
 
ఉపనయనాన్ని విధించింది. వటువు సూక్ష్మబుద్ధి
కలవాడైతే 5వ ఏట కూడా చెయ్యవచ్చును. 'దశమే
పంచమే వా కామ్యమ్' అనగా సూక్ష్మబుద్ధి కలవాడైతే
ఐదవయేట, మందబుద్ధి కలవాడైతే 10వ సంవత్సరం
లోగా ఉపనయనం చెయ్యాలని శాస్త్రం. కశ్యపమహర్షి
వచనాన్ననుసరించి 10 సం॥లలోపల ఉపనయనం
చేయుట ఉత్తమమనియు, 13 సం॥ల లోపల
ఉపనయనము చేయుట మధ్యమమనియు, 16 సం॥
లోపల ఉపనయనము చేయుట అధమమనియు అటుపైన
వ్రాత్యత్వ దోషము సంక్రమించి భ్రష్టుడు లేదా
పతితుడౌతాడని గ్రహించాలి. 16 సం॥లు దాటిన తర్వాత
వ్రాత్యత్వ దోషనివారణార్థమై ప్రాయశ్చిత్తం చేసి
ఉపనయనం చేసుకునే వెసులుబాటు కల్పించింది శాస్త్రం.
ఉపనయనం చెయ్యడం వల్ల ఒరిగేదేముంది?
లేకుంటే పోయేదేముంది?
 
1. ఉపనయనం చెయ్యడం వేదాధికారం అంటే
వేదములను చదువుకోవడానికి అర్హత కలుగుతుంది.
 
6
 
ఉపనయనమే గనుక చేయకుంటే :
 
1. కుమారుడు అగ్నికార్యము, గాయత్రీ మంత్ర
జపానుష్ఠానములకు అర్హతను కోల్పోతాడు. అంటే
ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేడు.
 
2. గురుకులవాసం వల్ల లభించే క్రమశిక్షణ లేకపోవడం
వల్ల ఇంద్రియ సుఖములకు బానిసయై చరిత్ర
హీనుడయ్యే అవకాశముంటుంది. అంటే అన్ని
విధములా భ్రష్టుడైపోతాడని భావం.
 
3. సాటివారికి లభించే గౌరవప్రతిష్ఠలు లభించకపోవడం
వల్ల, వీరిలో ఆత్మన్యూనతాభావం కలుగవచ్చు. అది
వ్యక్తిత్వ వికాసానికి ప్రతిబంధకము.
 
4. ఇలా తన ఆత్మన్యూనతాభావాన్ని విస్మరించడానికై
యతడు వ్యసనములకైనా బానిస అవుతాడు లేదా
అశక్తదుర్జనత్వంతో సమాజవిద్రోహకార్యక్రమములకు
తలబడతాడు. ఇలా యువత పెడదోవ పట్టి
చెడిపోయే ప్రమాదమున్నది. ఇది సామాజిక
సువ్యవస్థను భగ్నం చేస్తుంది. ఆ స్థితికి తమ సంతతి
 
8