2023-05-28 17:37:41 by ambuda-bot
This page has not been fully proofread.
ఉపనయనం
ఉపనయనం అంటే ఏమిటి? ఇది ఎందుకోసం?
దీనివల్ల మనకొరిగే ప్రయోజనమేమిటి? దీనిని చేయ
నందువల్ల మనం కోల్పోయేదేమిటి? ఈ విషయాలను
సప్రమాణంగా తెలుసుకుంటే, ఈ ఉపనయన
సంస్కారాన్ని మనం ఆదరించాలో విడిచిపెట్టాలో
నిర్ణయించవచ్చు.
జన్మతః మనిషికీ పశువుకూ తేడా యేమీ లేదు.
పశువుకన్నా మనిషికి స్వయంగా ఆలోచించే శక్తి, ఆ
ఆలోచనలను కార్యరూపంలో పెట్టి, వానిని మాటలద్వారా
ప్రకటించే సామర్థ్యమూ ఉన్నాయి. ఈ సంకల్పశక్తి,
బోధనశక్తి రెండింటివల్ల తాను ఉన్నతోన్నతములైన
అనుభూతులను పొంది, వానిని ఇతరులకు బోధించి
అతడు సమాజాన్ని ఉద్ధరించగలడు. కాకుంటే ఆ దిశగా
అతడు మలచబడాలి. అంటే శిక్షణ పొందాలన్నమాట!
1
తరువాత త్రైవర్ణికులకు అనగా బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్యులకు 'ఉపనయన'మనే సంస్కారం ప్రత్యేకంగా
నిర్దేశించబడినది. విద్య, రక్షణ, వాణిజ్యము ఈ మూడూ
సమాజాన్ని సర్వాంగీణంగా, సర్వతో ముఖంగా ముందుకు
నడిపిస్తాయి. తద్వారా దేశప్రతిష్ఠ సుప్రతిష్ఠితమవుతుంది.
అందుకు ఈ మూడు బాధ్యతలను నిర్వహించే బ్రాహ్మణ,
క్షత్రియ, వైశ్యులకు విచక్షణతో కూడిన విశిష్టమైన
ప్రశిక్షణ ఎంతైనా అవరం. ఆ అవసరాన్ని తీర్చడం కోసం
సాక్షాత్తుగా వేదర్షులు వేదధర్మంగా ఈ ఉపనయన
సంస్కారాన్ని ఉపదేశించేరు.
'ఉపనయనం' ఈ పదంలో ఉపనయనం
అని మరి రెండు పదాలు కనిపిస్తాయి. 'ఉప' అనే ఉపసర్గకు
సమీపము అని అర్థము. 'నయనము' అనే పదానికి
నేత్రము మరియు 'తీసికొనివెళ్లుట' అని రెండర్థాలున్నాయి.
నేత్రము అనే అర్థాన్ని భావిస్తే 'సమీపమున నున్న కన్ను'
అనగా మన రెండు చర్మచక్షువుల నడుమనున్న
'దివ్యచక్షువు' లేదా 'జ్ఞాననేత్రము' అనే అర్థం సిద్ధిస్తుంది.
-
3
ఈ ప్రశిక్షణను పొందిన మనిషి మనీషిగా, వ్యక్తిగా
రూపొందుతాడు. అతనిలో ఒక ప్రకాశవంతమైన
దివ్యచైతన్యం ఆవిర్భవిస్తుంది. అటువంటి వ్యక్తిలో
దైవీగుణాలు వెల్లివిరుస్తాయి. అతడు సాధారణ మానవ
అవస్థ నుండి దివ్యత్వాన్ని సంతరించుకుని 'భూసురుడు'
- 'భూమిపై చరించే దేవుడుగా' గౌరవింపబడతాడు.
ఇలా మానవునిలో గుప్తంగా ఉన్న దివ్యశక్తులను
ప్రకాశింపచేయడానికి గాను తపోధనులైన మన
మహర్షులు కొన్ని సంస్కారాలను సూచించేరు. బాగుగా
తోమిన రాగిపాత్ర చిలుము వదలి ప్రకాశించినట్లుగా,
ఈ సంస్కారములచే సంస్కరించబడిన వ్యక్తి, ఈ
భూలోకంలో దివ్యత్వంతో ప్రకాశిస్తాడు.
మాతృగర్భంలో పడడం మొదలుకొని, జన్మించి
జీవయాత్ర చాలించేవరకు ప్రధానంగా పదహారు
సంస్కారాలను మన మహర్షులు నిర్దేశించేరు. ఈ
క్రమంలో గర్భాదాన, పుంసవన, సీమంతోన్నయన,
జాతకర్మ, నామకరణ, చౌలములనే సంస్కారముల
2
ఆ జ్ఞాననేత్రమునకు సత్యము స్పష్టంగా కనిపిస్తుంది.
సత్యమును దర్శించినవాడు దివ్యత్వమును పొంది
భూమిపై దేవుడుగా అందరిచే పూజింపబడతాడు. ఇక
తీసికొనివెళ్లుట అనే రెండవఅర్థాన్ని గ్రహిస్తే విద్యాబుద్ధులు
నేర్పించడం కోసం తల్లిదండ్రులు తమ బిడ్డను ఆచార్యుని
సమీపమునకు తీసికొనివెళ్లి అతనికి వప్పగించుట అనే
అర్థం సిద్ధిస్తుంది. ఇది నేడు పిల్లలను బడిలో
చేర్పించడమన్నమాట. ఈనాడు మనం విద్యాలయాల్లో
చదువుకొంటున్నాం. ఆనాడు ఉపనీతులైన విద్యార్థులు
విద్యను సక్రమమైన పద్ధతిలో స్వయంగా ఆర్జించేవారు.
కాగా, పరిశీలిస్తే తమ బిడ్డలు విద్యాబుద్ధులతో దివ్యత్వాన్ని
సంతరించుకుని పూర్ణపురుషులు కావాలని తల్లిదండ్రులు
చేసే గొప్ప ఉదాత్తమైన సంస్కారం ఉపనయనం అని
సారాంశం.
ఉపనయనం ఎపుడు చేయాలి?
వసంతకాలంలో బ్రాహ్మణులకు, గ్రీష్మర్తువులో
క్షత్రియులకు, శరద్రుతువులో వైశ్యులకు ఉపనయన
4