2023-05-28 17:37:44 by ambuda-bot

This page has not been fully proofread.

ద్వితీయోపవీత ధారణమ్
మమ నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ
యజ్ఞోపవీతధారణం కరిష్యే ॥ పూర్వవత్ ద్వితీయ
యజ్ఞోపవీతం ధృత్వాచమ్య ॥
 
(అని సంకల్పించి పై మంత్రము నుచ్చరింపుచు రెండవ
యజ్ఞోపవీతము పైన చెప్పిన విధముగా ధరించి మరల
ఆచమనము చేసి)
 
తృతీయోపవీత ధారణమ్
ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీదధారణం కరిష్యే ఇతి
సంకల్ప్య, పూర్వవద్యజ్ఞోపవీతం ధృత్వాచమ్య అని
సంకల్పించి పై మంత్రముచే మూడవ యజ్ఞోపవీతమును
ధరించవలయును.
 
చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణమ్
 
పై విధముగా ఆచమనము చేసి చతుర్థ, పంచమ
యజ్ఞోపవీత ధారణమ్ కరిష్యే । అని సంకల్పము చేసి
పై మంత్రముచే 4,5 యజ్ఞోపవీతములను ఒకదాని
తర్వాత మరియొకటి ధరించవలయును.
 
61
 
ముందుమాట
 
ఉపనయన వివాహాది కార్యక్రమాలు ఎంతో వైభవంగా
చేసుకుంటున్నాం. దానికి ఎంతో ధనం ఖర్చు చేస్తున్నాం.
కానీ వాని అర్థం పరమార్థం చాలామంది తల్లిదండ్రులకు
గాని, వారి పిల్లలకు గాని తెలియడం లేదు. అవి ఏవో
సదాచారాల తంతుగా సాగిపోతున్నాయి. ఉపనయనం పెళ్లికి
లైసెన్సు, వివాహం సంతానం కనడానికి లైసెన్సుగా మాత్రమే
చెలామణి అవుతున్నాయి. మన యీ సంస్కారాల ప్రాముఖ్యం
తెలుసుకుంటే పిల్లలు, సమాజం బాగుపడుతుంది. ఈ దిశగా
వాటి పరమార్థాన్ని వివరిస్తే బాగుంటుందని చాలామంది
మిత్రులు సూచించేరు. ప్రచారానికి అనువుగా యించుమించు
శుభలేఖ ధరకు పంచేలా చౌకగా ముద్రించి యివ్వడానికి
మా సుతనిర్విశేషుడు చి॥ పద్మనాభం ముందుకు వచ్చేడు.
ఇలా ఈ పుస్తకం ఆవిర్భవించింది. ఈ జ్ఞానయజ్ఞంలో మాకు
సహకరించిన అమలాపురం వాస్తవ్యులు శ్రీ వడ్లమాని
కృష్ణమూర్తిగారి కుటుంబ సభ్యులకు మా కృతజ్ఞతలను
తెలియచేస్తున్నాం.
 
రచయిత మరియు ప్రకాశకులు,
పద్మనాభ ఆఫ్సెట్ ప్రింటర్స్, కాకినాడ
 
జీర్ణోపవీత విసర్జనమ్
 
తిరిగి ఆచమనము చేసి ఈ క్రింది శ్లోకమును
చదువుచు యజ్ఞోపవీతము విసర్జనము చేసి రెండుసార్లు
 
ఆచమనము చేయవలయును.
 
శ్లో॥ ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం ।
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే ॥
వేదావేద్యం పరబ్రహ్మతత్త్వం
 
జీర్ణోపవీతం విసృజస్త్యమోజః
 
అని చెప్పి భుజముల నుండి జీర్ణోపవీతమును క్రిందుగా
జార్చి అధోముఖంగా తీసివేయాలి.
 
శుభం భవతు
 
62
 
ఉపనయనం
ఎందుకు?
 
శ్రీపాదుక
 
ఆచార్య కొల్లూరు అవతారశర్మ
 
R సర్వహక్కులు గ్రంథకర్తవి