2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

వ్రతదీక్షాసామర్థ్యము, ఆయుష్షు, వర్చస్సు, బుద్ధి, ప్రజ్ఞ,
వృద్ధి పొంది అతడు సర్వవిద్యాపారంగతుడై సద్యశమును
పొందుతాడు. సంగ్రహంగా ఇదీ ఉపనయన సంస్కారం
యొక్క పరిచయం.
 
బ్రహ్మచారి పాటించవలసిన ధర్మములు
బ్రహ్మచర్య దీక్షలో చాలా విధి నిషేధాలు స్మృతి గ్రంథాల్లో
గోచరిస్తాయి. ప్రస్తుతకాలానుగుణంగా కొన్నింటినిలా
ఆచరించడానికి ప్రయత్నిద్దాం.
 
1. బ్రాహ్మముహూర్తంలో లేచి సకాలంలో సంధ్యా
వందనం అగ్నికార్యం చేయాలి. సూర్యోదయానికి
సుమారు 10 ని॥ల ముందు సంధ్యావందనం
ప్రారంభించాలి. సాయం సంధ్యను సూర్యాస్తమయానికి
10 ని॥లు ముందు ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే
సూర్యోదయ సూర్యాస్తమయాలకు సరిగా అర్ఘ్యప్రదానం
చెయ్యవచ్చు.
 
2. సాధ్యమైనంత వరకు ప్రాతఃసాయంసంధ్యల
రెండింటియందు అగ్నికార్యం చేయాలి. చేస్తే
 
37
 
7. గీత, నృత్య, వాద్య, వినోదములయందు అత్యాసక్తిని
పెంపొందించుకొనకుండా వానితో పరిమిత
పరిచయము కలిగియుండుట శ్రేయస్కరము.
8. సజ్జనులతో మాత్రమే సహవాసము. సహపాఠము
ఆచరించి మిగిలిన సమయమును జప, హోమ,
అధ్యయనము లందు మాత్రమే గడపవలెను.
 
9. పగటినిద్ర మంచిదికాదు. ప్రతిదినము బ్రాహ్మ
ముహూర్తంలో లేవాలి. రాత్రి తొలిఝాము పూర్తి
కాగానే అనగా రాత్రి 9-10గం॥లోగా నిద్రించాలి.
10. తల్లిదండ్రులు, ఆచార్యులు, పెద్దలయెడ విధేయతను
 
కలిగియుండవలెను.
 
ఈ విధముగా ఉపనయన సంస్కార ప్రాశస్త్యాన్ని
సంభావిస్తూ, తద్వారా లభించిన యజ్ఞోపవీత, గాయత్రీ
జపానుష్ఠాన, అగ్నికార్యములను సంధ్యావందనమున
కంగములుగా నిర్వర్తిస్తూ యీ మానవజన్మను దివ్యత్వ
సాధన ద్వారా చరితార్థము చేసికొనుటకై ఉపనయన
సంస్కారభాగ్యమును పొందిన వటువులు యథాశక్తిగా
 
39
 
తప్పకుండా మేధ, ప్రజ్ఞ, ఆయుష్షు అభివృద్ధి
 
చెందుతాయి.
 
3. కనీసం ఉభయసంధ్యల యందు నూటయెనిమిది
పర్యాయములు గాయత్రీ జపం చేయాలి.
 
4. అష్టోత్తర సహస్రం అంటే 1008 సార్లు జపం
చేయడం చాలా మంచిది. ముప్పొద్దుల సహస్ర
గాయత్రి చేసిన వ్యక్తి భూసురుడే అంటే దైవసమానుడే
అవుతాడు. అతని సంకల్పానికి వికల్పము ఉండదు.
ఇది ఎవ్వరైనా ఆచరించి అనుభవపూర్వకంగా
గ్రహించవచ్చు.
 
5. హితకరమైన మధురములైన సాత్వికాహారములనే
మితంగా భుజించాలి. నిషిద్ధములైన మద్య
 
మాంసములను తినకూడదు.
 
6. స్త్రీలతో పరిచయములు, అతిగా భాషించుట
నిషిద్ధము. తల్లి, సోదరి, ఇతరులైన ఆత్మీయులతో
కూడా మితముగా భాషించుట, మితముగా
చరించుట అలవరచుకొనవలెను.
 
38
 
ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఆచార్యులు పెద్దలు
పిల్లలకు ఆ దిశగా తగిన మార్గదర్శనం చేయాలి.
ఈ విధమైన పరస్పర సహకారంతో ఆబాలగోపాలము
తరించి సమాజానికి సుఖశాంతులు సమకూర్చాలని
అందరికీ వేదమాత గాయత్రి తగిన బుద్ధి ప్రచోదనమును
చేస్తూ ఆయురారోగ్యైశ్వర్యముల ననుగ్రహించాలని
ఆకాంక్షిద్దాం!
 
శుభం భూయాత్
 
సంధ్యావందనము
 
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా,
యస్స్మరేత్పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః
పుణ్డరీకాక్షః పుణ్డరీకాక్షః పుణ్డరీకాక్షాయనమః
 
ఆచమనము
 
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా,
మాధవాయ స్వాహా అని ముమ్మారు ఆచమించాలి.
 
40