This page has not been fully proofread.

ii
 
సృష్టియందు శక్తాశ క్తులకై సంబంధము అభేదము అని శాస్త్ర
సంప్రదాయముతో నిరూపించి శక్తి ద్వారా శక్తుని ధానవ్యక్తి
కనువగు భాష ఛందస్సు గ్రహింపబడినవి. ఇందలి వృత్తములు లౌకిక
ఛందస్సునందైనవే అయినను "బుం చేరే పరమేవ్యోమస్" అను
మంత్రవర్ణ భావములను వ్య క్తీకరించునవిగ నున్నవి. వర్ణ సంఖ్య తక్కువ
గల వృత్తపాదములలో పాదపూరణములున్న అంతయు వెలితిగ
నుండును. పెద్దపాదములందు అట్లు కానరాదు. కాని ఈ ఛందస్సులు
పరిపాకమునొందిన కవుల కేగాని ఇతరులకు సులభసాధ్యములు కావు.
అందును రమ్యత నాపాదించుట కష్టతరము. అల్పాల్
క్షరములలో ననల్ప
భావములను తెలుపుట సూత్రరచనయం దారి తేరిన కవులకుమాత్రమే
సాధ్యమగును. గంభీరవిషయముల నెరుంగగలవారల కీ సూచనలు
మార్గదర్శక ఫలకములు కాగలవు.
 
ఇట్లు,
 
అ. నరసింహశర్మ.
 
వేదైర్బోధవతే గిరాం విలసితైః సమ్మోదముద్రావతే
ధీరైర్భారత సూరిభి గలవతే పూర్వైః ప్రతిష్ఠావతే
మంత్రైర్మిత్రవతే మహర్షి చరణైరాచార్య లక్ష్మీవతే
కావ్యైః కంఠవతేధియా ధనవతేక స్మై చిదస్మై నమః ॥