This page has not been fully proofread.

ii
 
ప్రాతఃస్మరణీయులు గుంటూరు లక్ష్మీకాంతం నాయనగారి
ఈ నాల్గు స్తోత్రాలను సంకలించి 'స్తోత్రచతుష్కం' అన్న పేరుతో.
తెలుగు లిపిలో ముద్రించి చరితార్థులైనారు.
ఆ పత్రులు నేడు
కరువైనాయి. మిత్రులు శ్రీ ఆర్యసోమయాజుల మధు కేశ్వర రావు
నాగరిలో ఈ స్తోత్రాల్ని ముద్రించారు. రమణాశ్రమంలో ఒక ప్రతి
నాధారంగా చేసుకొని వ్రాసుకున్న వ్రాతపతిని, భక్తప్రియ అన్న
పేరుతో వ్రాసుకొన్న తెలుగు లఘువ్యాఖ్యను మాకిచ్చి సహకరించిన
అయ్యలసోమయాజుల నరసింహశర్మగారికి 'కావ్యకంఠ భారతి' పన
నా కృతజ్ఞతలు,
 
44
 
వ్రాతపతిని సాఫ్టు రాయడంలో మిక్కిలి శ్రమించిన మిత్రులు
శ్రీ పూడిపెద్ది లక్ష్మణమూర్తిగారికి, నాకు అన్నివిధాల చేదోడు
వాదోడుగా సహకరించిన పండితవరులు శ్రీ వాసా సుబ్రహ్మణ్య
శాస్త్రి, బి. ఓ. ఎల్. గారికి, శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు, ఎం. ఏ.
ఎ. ఫిల్, గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమనస్సులు,
 
కొన్ని కారణాలవల్ల శ్రీ అ.న. శర్మగారి లిఖితప్రతిని
యధాతథంగా ప్రచురించడం సాధ్యం కాలేదు. పాఠకుల సౌలభ్యంకోసం
కొన్ని మార్పులు, చేర్పులు చేయక తప్పలేదు. కొన్నిచోట్ల పండిత
సాంప్రదాయాన్ని ఉల్లంఘించి, పాదాంతంలో కూడా బిందువును
ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిలో దోషాలన్నిటికీ బాధ్యత సంపాదకు
ని దేశాని శర్మగారిది కాదని మనవిచేస్తున్నాను. యధేచ్ఛగ మార్పులు,
చేర్పులు చేయడానికి అంగీకరించిన సహృదయ శేఖరులు శ్రీ అ. న'
శర్మగారికి మరోసారి అంజలి ఘటిస్తూ-
1-10-'85
 
అనకాపల్లి
 
భవదీయుడు,
గంటి శ్రీరామమూర్తి.
 
* ప్రవేశిక
 
లహరి మొ
 
సుగృహీతనామధేయులు, కావ్యకంఠులు, వారిరచనలు శాస్త్ర
రహస్యములను వెలయించునవి. వారికి శాస్త్రకవి అనే ప్రసిద్ధి
అందు చేత నే వచ్చింది. వారి దేవీ స్తవములు లక్ష్మీసహస్రము, సౌందర్య
కోవకి చెందినవి.
కావ్యా
అందులో ప్రచండ చండీ
త్రిశతి ఒకటి శాక్తాగమానికి బ్రహ్మవిద్యలకుగల సంబంధాన్ని దేవీ
ఉపాసనలు శుద్ధబ్రహ్మోపాసనమే అనే విషయాన్ని వీరి ఉపనా
వివరణలు స్పష్టం చేస్తాయి. అవి ఆయా సందర్భాలలో వివరిస్తాను.
సంపూర్ణోపాసనలో నాలుగు భాగాలుంటాయి. బాహ్యంభ్యంతరోపాస
మొదటి భాగం.
నలు, మంత్ర జప రహస్యములు, యాగములు
ఆధ్యాత్మికము రెండవ భాగం. ఆదిభౌతికతత్వం మూడవ భాగం.
దేవీతత్వం నాల్గవ భాగం. ఈ నాలుగూ సంపూర్ణంగా తెలిసి చేసిన
ఉపాసన సంపూర్ణమైనది అవుతుంది. ఇవి ఉత్తరోత్తరం శ్రేష్ఠములు.
జన్మని శ్రీవిద్యా అంటారు. మోక్షప్రదం కాబట్టే
దీనికి పరావిద్యా అనే పేరు. వేదాలకి, తంత్రశాస్త్రానికి సమన్వయం
వీరి గ్రంథాలలో విశదీకరింపబడింది. కాబట్టి ఇది పూర్ణ విద్య అవుతుంది.
పురాణాలలో వివరింపబడిన దేవతలకు, వైదిక దేవతలకు వైరుధ్యము
శ్రీ
లేని సమన్వయం వీరు చూపేరు. సవిత సావితీ, ఇంద్రుడు ఇంద్రాణీ,
శివుడు శక్తి, రుద్రుడు రుద్రాణి మొదలగు నామముల చే వ్యవహ
రింపబడుచున్నను వస్తు భేదము లేదని నిరూపించబడినది. శౌనక వైదిక
దర్శనము, నివద అను వేదవిభాగము ఇందులకు ప్రమాణము. పాదుకా
దీక్ష, పూర్ణ దీక్ష, అగ్నిష్టోమము, కుండలినీరహస్యము వీనిని తెలిసి
తపస్సుచే వాని స్వరూపానుభవమందిన వ్యక్తి గాన అనుభవైక
రహస్యముల నిందు ఉపాసకుల సౌలభ్యమునకై నిరూపించినాడు.
 
అందుచేతనే
 
అంతే
 
*