This page has not been fully proofread.

1
 
ప్రథమ ముద్రణ : 1000 ప్రతులు
అక్టోబరు 1985
 
ఈ గ్రంథ ప్రచురణకు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం
రు. 2396-00 లు ద్రవ్యసహాయం చేసిరి. వారికి
 
ము ద్రోణ
విజయశ్రీ ప్రింటింగ్ వర్క్సు
కందకం రోడ్ :: రాజమండ్రి-1
 
మా కృత జ్ఞతలు.
 
సంపాదకీయం
 
అయ్యలసోమయాజుల సూర్యగణపతిశాస్త్రి (1878–1986)
కావ్యకంఠ వాసిష్ఠగణపతిమునిగా ప్రసిద్ధులు. "నాయన" అన్నది
భగవాన్ రమణమహర్షి, తదాశ్రమవాసులు ఆప్యాయంగా పెట్టుకొన్న
ముద్దు పేరు,
 
నాయన జన్మతః కవి. కవిత్వాన్ని మొదట్లో వినోదానికి,
ధనార్జనకి ఉపయోగించుకొని కవిచక్రవర్తిగా ఆసేతు తా చలపర్యంతం
విజయపతాక నెగర వేసినా, కొద్దికాలంలోనే కవితను తపస్సాధనకై
వినియోగించుకొని, కవిత- తపస్సు ఒకటిగా చేసుకొని, దేశ శదాస్య
విముక్తికి, పీడిత ప్రజానీ కానికి, స్త్రీజనాభ్యుదయానికి, వైదిక విద్యా
ప్రసారానికి తన వాణి దూతవాణి కాగా, తాను ఈశ్వరసాన్నిధ్యంలో
'జనదూత'గా వరలిన ఉత్తమాభ్యుదయకని గణపతిముని, సంస్కృత
సాహిత్యాకాశంలో ధృవతారగా నిలవదగినది 'ప్రచండ చండీతిశతి'.
కవి దేశాభ్యుదయానికై ఎంతగా తపించాడో, నవభారత నిర్మాణాన్ని
ఎంతగా కాంక్షించాడో, అతని చిత్తశుద్ధి ఎంతటిదో ఈ స్తోత్రకావ్యం
చదివితే తెలుస్తుంది. ఇది కవిత, ఇది తపస్సు, ఇది ఆర్తనాదం, ఇది
ప్ర్రార్థన, ఇది గేయం, ఇది ధ్యేయం, ఇది పిలుపు అని ప్రతి పాఠకుని
హృదయం పలుకుతుంది.
 
శివశతకంలో కవిత్వకళ ఉట్టిపడుతుంది. ఛందోవై విధ్యం, భావ
స్నిగ్ధత, వర్ణనావైద్యం కలనేతగా నేసిన ఈ చిత్రవర్ణ పటలం కఖ
కృత్తివాసుని కర్పించిన వస్త్రాపహారం. ఉమాశతకం కమశంఖాధ్యానం .
యమకానుప్ర్రాసల విహారభూమి. దేవీస్తుతి సంకీర్ణ సౌందర్య సీమ.