2023-11-21 21:54:38 by ambuda-bot

This page has not been fully proofread.

జలచక్రము మణిపూరము
జలదునిగా నాక్రమింప జాలిన నీతో
చలమగు విద్యుల్లతగా
 
తలపగఁ గన్పట్టునమ్మ తనరారి శివా! ॥36 ॥
 
హంసల నే బంధింపగ
 
హంసలకాధారమైన యానాహతమున్
హంసల మిథునము రూపున
 
హంసనుగా నన్ను జేయ నలరారు శివా! ॥ 37
 
నాకంఠపద్మమందున
 
నాకాశపు తత్త్వమరసి యా మీ కవనే
నా కన్నుఁగవకుఁ జూపుము
 
లోకము నే మరతునయ్య లోకేశ! శివా! ॥38॥
 
భ్రూమధ్యమందు నాజ్ఞను డంగ (GOOSE
సేమంబుగఁ జూపుమయ్య చిత్కళనిపుడే
భూమానందము నందెద
 
ఈ మాత్రపు కృపనుఁ జూపుమీశాన శివా! ॥ 39।
 
తలపూవు నందు నిలువుము
 
తలఁదలపులవెల పోయి తనరెద నేనే
 
ఫలముగ పండిన జీవన
 
వలమిది నాకీయుమయ్య పాలాక్ష! శివా! ॥ 40 ॥
 
10
 
వేడికోలు
 
కం. గ్రహదోషంబుల బాపుచు
 
నిహపరముల సుఖమునిచ్చు నీదగు నామం
బహరహమున జపియించుచు
 
నిహముననే ముక్తి గాంతు నీశాన! శివా॥ 41 ॥
 
కం. అడుగను మడిమాన్యంబుల
 
నడుగను సంపదల నిన్ను నరేందుధరా!
అడుగను నిన్నిలనేమియు
 
అడిగిన సాయుజ్యమిమ్ముమార్ధాంగ! శివా!॥ 42॥
 
కం. అక్షరలక్షలమించిన
 
యక్షరములనిచ్చితయ్య యక్షయ్యముగా.
అక్షత భాగ్యము నాకవి
 
దక్షములై నిన్నుఁ జేర్చు దక్షేశ! శివా! ॥ 43 ॥
 
కం. భోగంబుల నాశింపను
 
యాగంబుల సేయనయ్య యర్చావిధులన్
॥నే చేసెద
 
రాగాంబుధి ముంచకయ్య రతిసేవ్య శివా! 1144 ।
 
11