This page has not been fully proofread.

పంచలింగార్చన
 

 
రామేశ్వరమది మేనున
 

నా మూలాధారమయ్యె నందున నీవే

రామేశ్వర! భూమ్యంశను
 

రామార్చిత! నిలువుమయ్య రాజిల్లి శివా! ॥ 28 ॥
 

 
జంబూకేశ్వరలింగము
 

నంబుజమణిపూరమందు నస్తత్వముతో

నంబకము లోనఁదెరచియు
 

నంబాపతి! చూపుమయ్య అద్భుతము శివా! ॥29 ॥
 

 
అరుణాచలమాగ్నేయము
 

సరితూగగ దానికగును స్వాధిష్ఠానాం
 

బురుహము, వహ్ని తనువుగ
 

 
కరుణను నద్
దా
 
Anu
నిలుపు కామేశ! శివా! ॥ 30 ॥
 

 
శ్రీకాళహస్తి యందుఁబి
 

నాకధరా! మారుతంబనాహతసంజ్ఞన్
 

నీకోసమమరియున్నది
 

నీ కాంతనుఁ గూడి యచట నిండారు శివా! ॥31॥
 
8
 
కం.
 
కం.
 
కం.
 

 
 
ముదమున నిన్నే తలఁచెద

చిదంబరేశ! గగనసర సిజమధ్యమునన్
 

పదముంచి నన్నుఁ గావగ
 

యెదఁజేరగ రాగదయ్య యేమరక! శివా! ॥ 32 ।
 

 
ఆంతరదర్శనము
 

 
ఆంతర దర్శనమీయగ
 

స్వాంతము సంతర్పితమ్ము సంతుష్టమగున్

అంతరమపుడే తొలగును
 

అంతిమ కాంక్షితముఁ దాని నందిమ్ము శివా! ।॥33
 
ods odos
 

 
 
 
మూలాధారమునందున
 

బాలుని గణపతినిఁగొల్వ పాపములుడుగన్

లీలావతి భైరవి తా
 

కేలంగొని నాకు నిమ్ము కేలూత శివా! ॥34 ॥
 

 
కం. స్వాధిష్ఠమగ్ని చక్రము
 

శోధించియు ప్రజ్వలింప శూలిని నిన్నున్

బాధింపనీక యంబిక
 

సౌధంబగువృష్టిఁ గాచు నుంసుందరిగ శివా! ॥॥35 ॥
।we Teas
 
9