This page has not been fully proofread.

అక్షతలను పూజింపగ
 

నక్షయ సంపదలనిచ్చి యండగ నిలుమా

అక్షముడైనను నీకృప
 

దక్షుండగు ధరణిలోన ధరచాప! శివా! । 19 ॥
 

 
శంకర! నీవే చెప్పితి
 

శంకల బాయంగ మాకు చాలా సుళువుల్

శంకాలవాల చిత్తము
 

నంకితమతి నంబుజముగ నర్పింతు శివా! ॥ 20
 

 
ధూపమునంబరకేశా!
 

ఏపగిదిని నీకు నేను యిచ్చెదనయ్యా
 

నాపాలి కల్పభూజమ!
 

దీపముతో గొనుము దాని దివిజేశ! శివా! ॥ 21 ॥
 

 
సాజ్యమ్మగు నైవేద్యము
 

భోజ్యము గావించినాడ భోక్తవు నీవే
 

పూజ్యా! గొనుమాదరమున
 

త్యాజ్యమ్ముగ తలవకుండ దయఁగొనుము శివా! ॥22॥
 

 
ఏలా లవంగచూర్ణము
 

మేలగు కప్పురముతోడ మిళితముఁ దీనిన్

చాలా తములపుటాకుల
 

వీలుగ చుట్టితిని గొనుము విడెమిదియ శివా!॥23
 
6
 
11
 
కం.
 
కం.
 
కం.
 

 
'యోకపాం పుష్పం' బంచును

దీపంబారతిగ నిడెద దీవింపుమయా!

పాపంబులు వైదొలగగ
 

నేపారెడి మంత్రపుష్ప మిదియేను శివా! ॥ 24 ॥
 

 
నీ దేహము దిశలన్నిటిఁ
 

దా దాటియు నిండియుండఁ దరమా నాకున్
 

ప్రాదక్షిణ్యపు నతులను '
 

ఈ దాసుడు చేయుటెట్టు లీశాన! శివా! ॥25 ॥
 

 
కం. వేలకొలఁది యపరాధము
 

లేలాగున బాపుకొందు నీశా! నీవే
 

నాలాటివారి దిక్కయి
 

లీలల మరిచేసి పాప లెమ్మోయి శివా! ॥ 26 ।
 

 
ఉపవాసము జాగరణము
 

జపహెూమములేవిఁజేయఁ జాలను బేలన్
 

నెపమెన్నక నాచేతల
 

తవములుగా దలఁవుమయ్య దయతోడ శివా! ॥27 ॥
 
Eco వండి
 
7