2023-11-21 21:54:38 by ambuda-bot
This page has not been fully proofread.
హర! హర! శంభో! యనుచును
స్మరహర! నినుఁ బిలుచుచుంటి శంకర! రమ్మా!
చరణన్యాసముఁ జేయుము
త్వరగా నా చిత్తపీఠి దయఁజేసి శివా! ॥ 09 ॥
ఇదె పాదపీఠిఁ జూడుము.
పదపడి హేమాద్రి తానె పదమై నిలచెన్
పదముంచుమయ్య దానను
మదనాంతక! మౌనివంద్య! మాతండ్రి! శివా! ॥ 10
ఇదె సింహాసనమిదిగో!
మది తలపగ నిలిపినాడు మాహేశ్వరుడౌ
ముదమున ధనదుడు నీకై
విదితాశయ! వేదవేద్య! వేంచేయు శివా! ॥ 11 ॥
బంగారు పాత్రలోపల
గంగోదకమిచ్చుచుంటి ఘన పాద్యముగా
జంగమదేవర! పాదము
సంగీకృతి నీయవయ్య అవినాశ! శివా! ॥ 12
మిన్నేటి జలములర్ఘ్యము
పన్నీటనుఁ గలిపి నీకు పరిమళయుతమౌ
పున్నాగములనుఁ జేర్చియు
త్వన్నామార్పితమొనర్తు తరుణాభ! శివా! ॥ 13॥
కం.
కం.
మేచక పాత్రంబందున
శౌచంబగు విధిని నీకు సారంగధరా!
ఆచమన జలములుంచితి
ఆచమనముఁ గొనుము ప్రీతినర్చనను శివా! ॥ 14
కం.
స్నానముఁ జేయించుటకై
మానసమున తలఁపగానె మాన్యాపగలే
తానవమునంది వచ్చెను
స్నానంబొనరింపుమయ్య సర్వేశ! శివా! ॥ 15 ॥
కం. శతరుద్రీయపు మంత్రము
నుతియించుచు నేనుఁ జేయ నుదకాదులతో
జతనంబభిషేకంబిది
సతతము కొనసాగనిమ్ము సర్వేశ! శివా! ॥ 16 ।
కం. సీమల్మీరిన తనువుకు
సేమంబుగ వస్త్రమీయ సేవను నేనే
భూమాకృతి నీతనువది
నా మాటకు నణుతరంబు నైపోయె శివా! । 17 ।
ఉపవీతమొసగుచుంటిని
ఉపవాసము గోరి నీదు నుపకంఠంబున్
ఉపవీతమిదియ తొలఁగఁగ
నువదేశము నీయవయ్య ఉమతోడ శివా! ॥ 18
5
స్మరహర! నినుఁ బిలుచుచుంటి శంకర! రమ్మా!
చరణన్యాసముఁ జేయుము
త్వరగా నా చిత్తపీఠి దయఁజేసి శివా! ॥ 09 ॥
ఇదె పాదపీఠిఁ జూడుము.
పదపడి హేమాద్రి తానె పదమై నిలచెన్
పదముంచుమయ్య దానను
మదనాంతక! మౌనివంద్య! మాతండ్రి! శివా! ॥ 10
ఇదె సింహాసనమిదిగో!
మది తలపగ నిలిపినాడు మాహేశ్వరుడౌ
ముదమున ధనదుడు నీకై
విదితాశయ! వేదవేద్య! వేంచేయు శివా! ॥ 11 ॥
బంగారు పాత్రలోపల
గంగోదకమిచ్చుచుంటి ఘన పాద్యముగా
జంగమదేవర! పాదము
సంగీకృతి నీయవయ్య అవినాశ! శివా! ॥ 12
మిన్నేటి జలములర్ఘ్యము
పన్నీటనుఁ గలిపి నీకు పరిమళయుతమౌ
పున్నాగములనుఁ జేర్చియు
త్వన్నామార్పితమొనర్తు తరుణాభ! శివా! ॥ 13॥
కం.
కం.
మేచక పాత్రంబందున
శౌచంబగు విధిని నీకు సారంగధరా!
ఆచమన జలములుంచితి
ఆచమనముఁ గొనుము ప్రీతినర్చనను శివా! ॥ 14
కం.
స్నానముఁ జేయించుటకై
మానసమున తలఁపగానె మాన్యాపగలే
తానవమునంది వచ్చెను
స్నానంబొనరింపుమయ్య సర్వేశ! శివా! ॥ 15 ॥
కం. శతరుద్రీయపు మంత్రము
నుతియించుచు నేనుఁ జేయ నుదకాదులతో
జతనంబభిషేకంబిది
సతతము కొనసాగనిమ్ము సర్వేశ! శివా! ॥ 16 ।
కం. సీమల్మీరిన తనువుకు
సేమంబుగ వస్త్రమీయ సేవను నేనే
భూమాకృతి నీతనువది
నా మాటకు నణుతరంబు నైపోయె శివా! । 17 ।
ఉపవీతమొసగుచుంటిని
ఉపవాసము గోరి నీదు నుపకంఠంబున్
ఉపవీతమిదియ తొలఁగఁగ
నువదేశము నీయవయ్య ఉమతోడ శివా! ॥ 18
5