We're performing server updates until 1 November. Learn more.

2023-11-22 06:49:12 by sarmas

This page has not been fully proofread.

పలుకుల నుతులుగఁ దలపుము
 

పలు తిరుగులఁ దలచుమయ్య ప్రొదక్షిణముల్

గోలెడి జలమభిషేకము
 

తలపుము నా చేతలిట్లు తపమనఁగ శివా! ॥105
 

 
సంపదలు కలిగినప్పుడు
 

ఇంపుగ పదిమంది పొగడ నీడ్యుండనుచున్

పెంపున యౌవనముండగ
 

సొంపుగ నిను పాడనిమ్ము సోమేశ! శివా! ॥106 ।
 

 
వేదంబుల వల్లింపక
 

పాదములే మరి పట్టలేక పాపాత్ముడనై
 

మోదంబున మనుచుంటిని
 

ఈ దాసుని కరుణ జూడుమీశాన! శివా! ॥ 107 ॥
 

 
అందమ్మగు కందమ్ముల
 

నందముగా కూర్చగానె యమరెను నీకీ

నందము శతకంబయ్యెను
 

దమ్ములు నావి త్రైళ్లై భవముడిగె శివా! ॥108 ।
 
24
 

 
 
 
ఉపకారస్మృతి - ఫలశ్రుతి
 

 
కం. సుంతయు భేదము లేకయె
 
కం.
 

యింతటి మోదమ్ము గూర్ప నీకేమిత్తున్

అంతయు పోగా చిత్తము
 

సొంతము కాదనుచు నిత్తు సోమేశ! శివా! ॥
 

 
అష్టోత్తరశతపద్యము
 

లిష్టములుగ గొనుము నీవు ఈశుడవగుచున్
 

పుష్టిని పొందియు శతకం
 

బిష్టము జదువరులకిచ్చునిలలోన శివా! ॥
 
25