This page has not been fully proofread.

శివశతకము
 

 
రచన : శ్రీపాదుక ఆచార్య కొల్లూరు అవతారశర్మ
 

 
కం. శివనామ జపము చేయుచు
 

శివరాత్రిని గడుప నేను శివశతకంబున్

శివ సంకల్పము తోడుత

కవనార్చనమనగ నీకు గావింతు శివా! ॥
 

 
కం. ముందుగ గణపతిఁ గొలిచియు
 

అందంబగు నమ్మ చరణమంటియుఁ దలతో

కందములే కుందములన
 

పొందిక పద్యములఁగూర్చి పొగడెదను శివా! ॥
 

 
కం. చిన్మయమగు చైతన్యము
 

ఉన్మనియౌ కళగ లోన నుద్దీప్తంబై
 

మన్మనమున భాసింపగ
 

తన్మయతను నిన్ను నేను తలచెదను శివా! ।
 

 
1