2023-08-17 09:21:27 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రథమాశ్వాసము.
 
*) సలుంబ్రాకృష్ణసింహవిభుఁడు సాగరసింహునకు హితము నుపదేశించుట. (*
 
చః అనుచుఁ తాపుఁజేరఁజను నాతనిఁ గగ్గోని కృష్ణసింగు "నీ
 
కా
 
వనుజుఁడ వమ్మహాపభున; కాయన నిందఱలోన నిప్పు డి
ట్లనుచు నిరోధము సలుప న్యాయమె! శత్రువులెవ్వ రిప
దని యెదిరింప నియ్యదియు నార్యులు మెచ్చెడి మేటికార్యమే!
చ॥ కలకలలాడుచున్న సభ్య గల్గిన లోకుల మోములెల్ల ము
గలములమాడ్కి నైన వివెకల్గెను దారుణమైన నీకు మా
టలు వినినంత; కోపము విడజను నిత్తఱి; శాంత మూనఁగాఁ
గలిగిన మేలు సుమ్మిపుడు; గడ్డము పట్టి వచింతు సాగరా!
మ॥ మనమందు గల కౌర్యముక్ విడువు; నా మాటక్ మది న్నిల్పు; పా
వన గంగాఝర వారిపూరముల వి ప్రశ్రేణి మూర్థాభిషే
చనము జేసిన యిమ్మహాత్ముని పదాబ్దంబుల్ తలక్ సోఁక నొ
క్క నమస్కారము చేయు; మీతఁడు నమస్కారార్హఁ డెవ్వారికి.
క॥ సరళమతి యోజింపుము; పొరవడకుము; వినవె! 'పితృసమో జ్యేష్ఠ' యనక్;
గురుఁ డుదయసింహుతో నిప్పురుష వరుఁడు సముఁడు నీకుఁ బూర్వజుఁ డగుటక్. 291
 
చ॥ కలుగఁగఁజేయఁబోకుసుమి గందరగోళము; విన్ము నీను మా
 
ట లితని సద్గుణంబుఁ బొగడదగు; నిందకుఁ బన్కి రావు; చే
తు లితనిపాదముల్ నిలుపఁ దోరఁపుఁ బాదుకలైనఁ జెల్లుఁ; గ
త్తులుగొని తాఁక దోషమగుఁ; దోఁచిన యంతయు నీకుఁ జెప్పితి౯."
 
చ అని వినయమ్మునుక్ నయము
 

 
నాదర మొప్పఁగఁ గృష్ణసింగు ప
ల్కిన విని సాగరుండును జ లింపక "ధర్మ మొకండె నేను గో
రిన; దది వీడి వీను లల రించెడు నీతు లివేల! తెల్పు మే
మనెదొ ప్ర్రతాప! నీ విపుడు న్యాయము నిల్పెదొ! ప్రక్క కేగెదో!
చ॥ స్థిర గుణమాన్యుఁ డయ్యుదయ సింహమహీరమణాగ్రగణ్యుఁ డం
దఱను సమంబుగాఁ గనిన తండ్రి; కుమారుల యోగ్యతాపరం
పరల నెఱింగి రాజు జగ మల్లును జేయఁగ నాన తిచ్చె; న
ప్పరమపవిత్రమానేసుని పల్కు ను నిల్పుట పుత్రధర్మమా.
 
1
 
EN.
 
288
 
289
 
290
 
292
 
293
 
294