2023-08-17 09:21:08 by ambuda-bot

This page has not been fully proofread.

2
 
నని నాకుఁ గొండంత కోరిక గలిగినది. ఆ విశ్వవీరుని నామధేయము కనఁబడిన గ్రంథముల
నెల్లఁ దెప్పించుకొని పఠించితిని. భాగ్యవశమున ననేకామూల్యాంశములు గడింపఁగలిగితిని.
వత్సరములకొలఁది నామహాభాగుని గుణగణము లూహించి, భావించి, ధ్యానించి, తన్మ
 
:
 
యుఁడ నగుచుంటిని.
 
చౌరా
 
-
 
కోటల
 
ఇతివృత్తము సంపూర్ణముగఁ జరితాత్మకము. రంగము పవిత్రమయిన యార్యా
వర్తక్షేత్రరాజము. ప్రధాననాయకుఁ డుత్తమోత్తమ భారతీయ శిరోమణి. అయిన నుత్తర
హిందూస్థానమందలి (అహమ్మదాబాదు - అసహుల్ వారా - ఝసల్ మియర్
ఘర్) మున్నగు పురముల నామములును, డోంగరీశుఁడు - సో నెగుఱ్ఱమహీంద్రుఁడు
మహమ్మజ్జలాలుద్దీనక్బరు - ఖాఖానర్-హకీంహుమాం మీర్జా అబ్దూరహిమాజ్)
లోనగు పురుషుల నామధేయములును, (మండలగృహము అంతల్లా - కుంభల్ మియర్ -
చేవందా - చానార్ దుర్గము - తారాఘర్ రణ స్తంభపుర దుర్గము) మొదలగు
-
పేళ్లును శ్రుతికటువులై దీర్ఘములై ఛందోగణములలో సులభముగ నిముడనివై యున్నవి.
మఱియు నిది 25 సంవత్సరము లవిచ్ఛిన్నముగ సాఁగిన మహాసంగామము. సాధనములు
శరచాపములుగావు. తుపాకులు- శతఘ్నులు, మాతృకలోఁ బదునాలుగుపుటలున్న ప్రతా
పసింహరాజచంద్రుని చరిత్ర మొక్క కళ తక్కువగ వెలుఁగుచున్నది. రాజస్థాన దేశ చరిత్ర
మనేక రాజ్యములను వీరయోధులను గుఱించి వ్రాయఁబడినది. కావునఁ బతాపుని పాత్ర
మును బ్రత్యేకముగను సమగ్రముగను బోషింప నవకాశము లేకపోయియుండుట సత్యము.
ఆ కొఱవడిన 'ఆధ్యాత్మికకళ'ను జేర్చి యా రాజగురుమహాసార్వభౌముని పాత్రమునకు
వన్నె చేకూర్చి నిర్వచనకావ్యముగ వెలయిప నారంభించితిని.
 
-
 
1932 మార్చి నెలకు మూఁడాశ్వాసములు వాయఁగలిగితిని. ఆరోగ్యము చాలక
కడపఁ దాఁటి కదలఁజాలని దుర్బలస్థితి నుండి గ్రంథ మంతటితోఁ గడమవడిపోవునేమో
యని పలుమాఱు వగ నొందితిని. పదునెనిమిది మాసము లంతరాయమున కోర్చి మఱల
నారంభించి యొకమాసమున గ్రంథముఁ బూర్తి చేసితిని. నా పరమమనోరథఫల స్వరూప
మగు ప్రతాపదేవుని దివ్యచరిత్రము నాద్యంతము రచించి నిర్వహింప ననుగ్రహించి నాకు
మనః పరితృప్తి గలుగఁ జేసిన యీశ్వరుని కరుణామయత్వమును గొనియాడితిని.
 
ఈ గ్రంథమున కావిష్కరణమహోత్సవముఁ దీర్చిన మిత్రులు ప్రశంసాపాత్రులు.
ఆవిష్కరణ సభ "కావ్యకళానిధి" బిరుదము నొసంగి నన్ను గౌరవించినందులకై ప్రొద్దు
టూరు హైస్కూలులో "కళానిధి" బహుమానము శాశ్వతముగా నెలకొలిపిన శ్రీ
 
(
 
వు బహదూరు వి. వసంత రావుగారి యాదార్యమును గణింతును.