2023-08-17 09:21:07 by ambuda-bot
This page has not been fully proofread.
వి
605)
జాణే
68
లెస్ట నెంటు కర్నల్ జేము టాడ్డుదొర ( Lieutenant Colonel-James-Tod )
రాజస్థాన దేశ చరిత్రము ( Appals and Antiquities of Rajasthan) చదివి నప్పటినుం
డియు నా గ్రంథము నెడ నా కతిశయ గౌరవము గలిగెను. ఆ యితిహాసరంగమున నర్తిం
"చిన పాత్రములలో "మహారాణా ప్రతాపసింహుఁడు" పూర్వాభిగణ్యుఁడు. స్వాతంత్ర్య
శబ్దమునకు మున్నెన్నఁడును లేని రసార్ణసంపత్తిఁ గూర్చిన 'విశ్వవీర చూడామణి.' భగీరథ
ప్రతీకాశ కార్యదీక్షా ధురంధరుఁడు. చిన్న రాజ్యమున కధీశ్వరుఁడయినను మాతృ దేశభక్తి
పరత్వము పెంపున నీ రాజర్షి
పుంగవుఁడు 55 లక్షలు పాదాతిబలము, 15 లక్ష లాశ్వికదళము,
10 వేలు వారణములు, 10 వేలు పిరంగులు గలిగి ప్రపంచోన్నత ప్రబల సార్వభౌముఁ
డయిన యక్బరుపాదుపాతో నిరువదియైదు వత్సరములు మహాసంగ్రామము నడిపి స్వా
తంత్ర్యము నిలుపుకొని ధర్మవీర శిరోమణియని కీర్తి మోసెను.
నిజమా క్తికసితాతపత్రచ్ఛాయల సమగ్రదక్షిణాపథ రాజ్యము లన్నింటికీఁ జలువఁ
గూర్చి దశదిశల ధవళకీర్తిచంద్రికలు నెఱపి శ్రీకృష్ణ దేవరాయలు యశఃకాయుఁడై న పిదప
నతని యనంతరము వారి పరిపాలనమున రాజ్యము చెదరి, పాయలై, చెడి, దేశమంతయు
ననంత నిరంతర సంగరములలో మునింగిన కాలమగుట "రాణా ప్రతాపసింహుని" వీర విక్రమ
విహారకథనములు దక్షిణభారతమున వ్యాపింప నవకాశము తక్కువ యయ్యెను. ఆకార
ణమున నితని పేరు దక్షిణాపథమున నేపదిమందియైన నెఱింగియుందురో లేదోయని సందేహ
ముండెడిది. ఉత్తర భారతదేశమునమాత్ర మా మహావీరుని దివ్యనామముఁ గీర్తించి పుల
కితశరీరులుగాని వారు లేరు.
పూజ్యులగు పూర్వమహాకవులు పలుమాఱు వ్రాసిన పురాణాంశములఁ గుఱించి
కాని, కల్పితకథలను గొనికాని ప్రబంధములు రచించుట తొలుతటినుండియు నాకు రుచించి
నదిగాదు. అతిశయోక్తు లకుఁబోక జరిగినది జరిగినట్టులు వ్రాసిపెట్టిన సత్యమగు దేశచరిత్ర
ములు ప్రజాప్రభోధక ప్రబల సాధనములని నావిశ్వాసము. కావున నింతకుముందు ఘూర్జర
దేశచరిత్రమందలి "వీరమతీదేవి చరిత్రము" మేవాడ్ దేశ చరిత్రమునందలి "చండనృపాల
చరిత్రము" పద్యగ్రంథములుగ విరచించితిని. ఎన్ని విధములనయినను యత్నించి లోకోత్తర
వీరవ్రతుండగు "ప్రతాపసింహుని" దివ్య చరిత్రముఁ గూడఁ గావ్యముగ రచించి యాంధ
భాషాయోషామణి మృదుపదార విందముల చెంత సమర్పించుకొని కృతకృత్యుఁడఁ గావలె