We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:13 by ambuda-bot

This page has not been fully proofread.

పూర్వపీఠిక.
 
ఈ చనుదెంచి నన్నుఁగని వందనమని వచియించి నిలువఁ । దమ్ముఁడ రార
మ్మని కౌఁగిటఁజేరిచి చెంతను నేఁ గూర్చుండుమన నతఁడు కూర్చుండె.
గీ స్వాంతమునఁ బొంగి పొరలేడు హర్షభరము వికసిత ముఖాబ్జములపైన వెల్లివికీయ
మాటలాడితి మలపును । మలపులేని కుశల సంప్రశ్నములఁ గూర్చి కొంతతడవు. 14
చః చిఱునగ వాస్యసీమ వికసింపఁగ వెంకటశేష శాస్త్రి "సో
దర! మును నన్నయాది కవి తల్లజు లెల్లపు రాణసంతతుల్
సరస పదార్థ భావ గుణ సంభృతమై తగు మంచి శైలిలో
విరచన చేసియుండి రవి విశ్వజగన్నుతమై తనర్చెకుక్.
 

 
కథ పిదపఁ బురాణాంతర్గత విదిత వివిధకథలు గొనుచుఁ బెద్దన్నాడుల్
పదు నెనిమిది వర్ణనములు గదియించి రచించి రఖల కావ్యశ్రేణుల్,
ఉ॥ కాలము కొంత యిప్పగిదిఁ గావ్య యుగంబుగ సాఁగె; దానిలోఁ
బూలవనంబు లయ్యమృత పుసెలయేఱులు

నిగ్గుటాణి ము
త్యాలబెడుగు మేల్గొడుగు లచ్చపు వెన్నెల సోగలో యనర్
జాలిన మేటికావ్యము ల సంఖ్యముగా జనియించె వ్రేల్మిడి౯.
4
ఉ॥ ఆవలఁ గొన్ని నాళ్లరుగ నంతట సంతట సారవంతమౌ
త్రోవలు తప్పి కాంతి చెడి దుగ్గమ దుర్గములట్లు భీకరా
శ్రీవిషమున్న వేటికల చెల్వునఁ గానన రాజి మాడ్కిఁ గా
వ్యావళులుక్ వికాసగుణ మంతయుఁ గోల్పడె బీడువోవుచుక్.
కః పెక్కామడ కొక్కఁడుగా నక్కడలిని గల్గు దీవు లట్టులు కైతల్
 
చక్కఁగ లిఖించు వారల రిక్కాలంబునను నొక్క దిగువురు పెద్దల్.
మ! ప్రతిభాపూజ్యులు వారు వ్రాసిన మహ గ్రంథంబు లగ్యంత పు
ణ్యతమంబుల్ గద! వాని నట్లునిచి యన్యగంథముల్ చూచిన
మితియో మేరయొ యేమన వలయుః స్వామీ! వద్దు చాల్ చాల్ సర
స్వతికి వాతలు పెట్టిన ట్లలరుఁ 'బా పం శాంత' మిప్పట్టునక్.
 
చ యతులు వనాళిఁ, బ్రాసములు నాయుధశాలల, లక్షణంబు ల
శ్వతతి, రసంబు వైద్యుకడఁ; బాకము వంటలలోన, నయ్యలం
4
కృతులు పడంతులందు, మఱి రీతులు రోఁతల, శయ్య మేడ, ని
ట్రతికిన కావ్యముల్ గనిన నయ్యః యొడల్ దహియించినట్లగు.
 
3
 
13
 
15
 
16
 
17
 
18
 
19
 
20
 
21