2023-08-17 09:21:07 by ambuda-bot
This page has not been fully proofread.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సమీక్ష.
(భారతి నవంబరు 1943.)
రాణాప్రతాపసింహ చరిత్ర తలమానిక మువంటి గ్రంథము. ఆహృదయ
మీ రాణాప్రతాపచరిత్రయందు మహాభారతమునం దెంత యున్నదో యంత
యున్నది. భారతము పూర్వకాలము కథనే చెప్పును. అందులోనున్న ధర్మము
మాత్రమే మనజాతిది. ఆవిషయము ద్వాపరయుగమునాఁటిది. మనపరిస్థితులతో
సంబంధము లేనిది. పతాపసింహచరిత్ర మనధర్మమునేగాక మన పరిస్థితులను
గూడ చెప్పును. పతాపసింహునికన్న ధర్మరాజాదు లేమియు నెక్కువవారు
కారు. వస్తురమ్యతకుగాని, కథాచమత్కారమునకుగాని, ఇందలి భిన్న పాత్రల
భిన్న తావిశిష్టతకుగాని భారతమున కీగ్రంథము తీసిపోదు. వస్తు విటువంటిది.
కవి యెటువంటివాఁడు? వ్యాసునకు తిక్కన్నకు నెంత వీరరసావేశ మున్నదో
యంత వీరరసావేశము గలవాఁడు. న న్నెవరైన భారతములోని యుద్ధపంచ
కము తిక్కన్నగారు వ్రాయకయుండుచో మఱియెవరు వ్రాయగల్గుదురని
ప్రశ్నించినచో నేను "రాజ శేఖరశతా వధానిగా" రని సమాధానము చెప్పెద.
యుద్ధవర్ణన యెచ్చటచూచినను, తిక్కన్న గారి రచనతో దులదూగుచున్నది.
ఈగ్రంథము అస్వతంతజాతి కొక స్మృతి×ంథము వంటిది.
రాణాపతాపునకు మహాత్మునకు గల సామ్యము భారతజాతికి గల
యస్వతంత్రత. మహాత్మునిది కత్తిలేని సాత్త్వికపు పోరు. పతాపునిది కత్తి
గల సాత్త్వికపు పోరు. నేఁటి సత్యాగ్రహమునకు ఆనాఁటి ప్రతాపుని యు
ధర్మమునకు భేదమే లేదు.
3
ఈ రచన భారతమును దలపించుచున్నది. ఈకవి చాల చోట్ల నన్నయ్య
గారిని పోలినట్లు వ్రాయును. ప్రతాపునిశౌర్యాగ్ని రాజి నుండి యత్యుగ్రమై
పాతికయేండ్లు తగుల బెట్టిన ఘట్టము. ఆశౌర్యము, ఆయుద్ధములు, ఆప్రతిజ్ఞలు
అవి యన్నియు వ్రాసినచో పట్టరానంత గ్రంథ మగును. ఈకవిసార్వభౌముఁడు
ఈఘట్టము చిత్ర చిత్రములుగా వ్రాసెను. మొదట నే చెప్పితినిగదా ఈగ్రంథము
యుద్ధ పంచకమువలె నున్నదని.