2023-08-17 09:21:10 by ambuda-bot

This page has not been fully proofread.

18
 
...... ఈ వీర చూడామణి (ప్రతాపసింహుఁడు) భారతీయులకు నిత్యోపాస్యుఁడు.
ఈతని యుదా తచరిత్రము నిరంతర పారాయణ యోగ్యము. వస్తు గౌరవమునను గ్రంథవిస్తృ
తిని యీకాలమున వెలువడుచున్న కావ్యములలో దీనికి మహత్త్వము సమధికమై యొప్పినది.
 
ఈ కవి వీరసత్వ సంపన్నుఁడు. ఈయన కృతులు వీరరస ప్రతికృతులు. వీర
వరుల గాధ లీ వీర సత్త్వు ని హృదయమునకు సాక్షాత్కారము నొసఁగి వీరరస పరివాహి
నులగు పృథుల కావ్యములై వెలసినవి. ఇట్లు అగ్గలించిన అలవాటునను పెంపు గనిని నే
రుపునను, చేయి వడిదిరిగిన యీయన నేఁడు రచించిన యీ రాణాప్రతాపసింహచరిత్ర
మీ యన రచనములకు మేల్బంతి. దీనిని వెలయించి యిపు డీయన కావ్యకళానిధియైనాఁడు.
ఈయఖండ కావ్యమున కవితాసామగ్రి గ్రంథకర్తృ సామర్థ్యమున కుద్దిగ నున్నది. ఈ
గ్రంథమున కవితా సామగ్రికిఁ గొఱంతయేలేదు. ఉపమాలంకారము లిం దసంఖ్యముగఁ
గలవు. వానిలోఁ బెక్కింటి కపూర్వతయు నబ్బినది. గ్రంథమున నవిరళముగనున్న సవ్య
కల్పనములు గ్రంథకర్త కల్పనా కౌశలమునకుఁ జక్కని తెలివిడి. కవితాధార ఉత్కూల
ముగఁ బొంగిన వర్షాకాలమునందలి మహానదీ ప్రవాహమువలె నిరాఘాటముగ పరుపులు
వారుచుండును. అందంగు దానఁ బూర్వకవుల ధోరణియు పొడకట్టు చుండును.
 
*
 
కవి తనస్వతంత్రశక్తి నన్నింటను గనబఱచినాఁడు. అది యిందలి విశేషము. ఇట్టి
గ్రంథములు కేవల చరిత్రాత్మకములు వీరరస ప్రధానములు నయినవి ఆంధ్రవాఙ్మయు
మునకుఁ క్రొత్తలు. వెనుకటివారి కట్టివానిపయి రుచి పుట్టినది కాదు యే యిద్దఱు-ముగ్గురకో
తప్ప, నేఁటివారిలోఁ గొందఱ కట్టి రచనములు గిట్టినను అఖండత అవునుగాని దయిపోయి
నది. అఖండముగ నట్టి గ్రంథములఁ బెక్కింటిని రచియించి యాంధ్రమున కర్పించిన యతఁ
డిప్పటి కీరాజ శేఖరకవియే కనుపించునది. ఈయన రచనములవలన నాంధ్ర సాహిత్యము
బలుపుఁ గనినది. దీనికై యీ కావ్యకళానిధి నెంత కొనియాడినను దీఱదు.
 
రకా
 
"భారతి"
 
డిసెంబరు 1934.
 
Ge