2023-08-17 09:21:11 by ambuda-bot

This page has not been fully proofread.

రసాయనంబై యనర్గళధారా ప్రవాహ పరిపూర్ణంబై మృదుమధుర పద భూయిష్ఠమై
శైలి శ్లేష-ప్రసాద మహిమలఁ జెన్నొందుచు యుద్ధపుఁబట్టుల దిక్కన సోమయాజి శై లిని
డలపీంచుచుఁ గొన్ని యెడలఁ బోతన కంకంటి పాపరాజప్రధానుల స్మరణకుఁ దెచ్చుచున్నది.
పస్తుతాంధకవికుంజరులలో నీ కవి యసమాన విఖ్యాతి వహించి యున్నాఁడు.
 
శ్రావణ శుణి లు.
 
"కౌమోదకి"
 
రు
 
నీరి కృతులు దిగంత విశ్రాంత కీర్తివహించి జయపతాకము నెలకొలిపినవి. కవికుల
కోటిలో వీరి కగ్రతాంబూల మీయక తప్పదని "ఢంకా" వాయించినది వీరి "రాణా
ప్ర్రతాపసింహ" చరిత్ర. ఈగ్రంథ ప్రాశస్త్యము వివరించి చెప్పఁదలఁచిన నీగ్రంథమంత
గ్రంథము వ్రాసినఁగాని తేటపడదు. ఏ యే సమయమం దే యే పదము ప్రయోగించిన
రస ముట్టిపడునో యా యా సమయమున నా యా పదమునువాడి జిలిబిలి ముద్దుపలుకుల
తో, ధారాళమైన ధారతో, లలితములైన పదములతో, సరళమైన శైలితో, గ్రంథమంతయు
నొ కే తీఱున నడిపించిన వీరి యద్భుతశక్తి సంశ్లాఘ్యము. ఆంధ్రుల పాలిటి కల్పవృక్ష మిది.
కవిత్రయము వారు భాషా గురువులై యాంధ్ర కవిత్వమునకు మార్గదర్శకులైనట్లు నవీన
ప్రబంధములకు వీరు మార్గదర్శకులగుచున్నారు. వేయేల! యీ గ్రంథము వా
యునపుడు వీరే రాణాప్రతాపసింహులైరో, రాణాప్రతాపసింహుఁడే కవిసింహులగు వీరి
రూపముఁ దాల్చెనో యనిపించినది. అరుగరాచిన కొలంది పరిమళ మతిశయించు శ్రీగంధపుఁ
జెక్కవలె నీగ్రంథము చదివిన కొలంది నమృతరస మొలుకు చున్నది. ఈగ్రంథము మహా
భారతమువలె నైతిహాసికు లితిహాసమనియుఁ గవి వృషభులు మహాకావ్యమనియు క్లౌ
ఘింపవలెను. అన్ని గ్రంథము లొకయెత్తు. రాణాప్రతాపసింహ చరిత్ర మొక్క యెత్తు.
ఆంధ్రభాషా రామామణి కిది శిరోభూషణము, ఆంధ్రవాఙ్మయక్షేత్రమున ఫలించిన పారి
జాతము, ఆంధ్రలోకమున నవతరించిన మహారత్నము. రాజశేఖరు నింట వెలసిన వాగ్దేవి.
కవి గావించిన యాంధ్రసార స్వతకృషి నుండి యుద్భవించిన యమృతకలశము.....
 
ఓమహాకవీ!
 
గీః నీదు కావ్యంబునం దెంత నిగ్గు గలదొ! వ్రాయుచో భారతం బంత గ్రంథ మగును!
సారమును గాంచఁ గొన్ని వర్షములు పట్టు నన్న! దీని గుణంబెన్న నలవియగునె!
 
నూజివీఁదు.
 
"వై జయంతి"