2023-08-17 09:21:10 by ambuda-bot
This page has not been fully proofread.
18
పండిత పామరజనరంజకము. పూర్వకవులు భారతభాగవతాది పురాణేతిహాసములలోని -
చరిత్రములు లిఖించియున్నారు. ఈ కవి యట్లుగాక యధునాతన చరిత్రమును వ్రాసి
యున్నాఁడు. అందును కథా నాయకుఁడు హిందుపైనను బతివీరుఁడు యవన చక్రవర్తి
యయిన యక్బరు. ఈపేరుతోపా టితని పక్షమునఁ జేరిన వారందఱ పేర్లును నిట్టి తురుష్క
భాషకుఁ జేరినవే. వీరియుద్ధము భారతాది యుద్ధములవలె వస్త్రశస్త్ర ధనుస్సాధముగాక
ప్రాకృతసాధన భూయిష్ఠము. ఇట్టిదానిఁ బ్రాచీనకవితాధారలో నడిపించి గ్రంథమునకు
వన్నె తెచ్చిన యిక్కవిపౌఢిమ కడుంగడు శ్లాఘ్యము. రంగారాయ చరిత్రాదుల
వంటివి కొన్నియున్నను నవి యతిప్రౌఢములై కేవల పండితైక వేద్యములేకాని యాంధ్ర
భాషావిదుల కందఱకును సులభములుగావు. కనుక దేనజూచినను నీ గ్రంథము మిక్కిలి
కొనియాడఁ దగియున్నది. ఇట్టి చరిత్ర రచించి తన యసాధారణ ప్రతిభ నేకాక దేశభక్తి ని
సనాతన ధర్మతత్పరత గ్రాంధిక భాషాభిమానము వెల్లడించిన యీ రాజ శేఖరముగారు
కడు ధన్యులు.
భావ, మార్గశిరము
"అభినవ సరస్వతి"
ఈ మహాకవి విద్యా శేఖరుఁడైన సంపన్న గృహస్థువు. అనేక గ్రంథములు రచించిన
కవిలోక శిఖామణి. గ్రంథము సర్వోత్తమమైనది. నవరత్నములను ప్రసిద్ధికలను. కాని
యిం దన్ని పద్యములు రత్నములే యనవలయు. ప్రతాపసింహుఁడు ధనబలముమాత్రము
లేకున్నను దేశాభిమానబల మపారముగఁ గలవాఁడగుటచేఁ బోరాడుచు సైనికుల కుత్సా
హము గలిగించుచున్న తావుల గల పద్యములఁ జదివినచో దుఃఖాశు, బిందు సందోహము
ప్ర్రవాహరూపము దాల్పకపోదని మా విశ్వాసము. ఉదాహరింతమని యేభాగమును జది
విన నం దొక్క పద్యమైన వదలఁ దరముగాదు. ఏభాగము చూచిన యతిప్ర్రాసముల కై
కక్కు–రితిపడిన జాడ గానరాదు. శైలి గంగా ప్రవాహమువలె నున్నది.
ఆషాడ బ ౧౦ లు
"లింగ"
ణ
టాడ్డుదొర గ్రంథము పూర్ణ చరిత్రాత్మకము. ఆ బంగారమున కీకవి సువాసన
యబ్బించినాఁడు. కవీశ్వరుఁడు ప్రతాపుని ప్రతాపము నుగ్గడించుటలో వైరివీరుల విశేష
మును మఱవలేదు. అక్బరు ముఖ్యమంత్రి "యబూరహిమాను" శీల మప్రతిమానము.
అతఁడు మహాత్ముఁడేసరి. యజమానినే ధిక్కరించి ప్రతాపుని సర్వస్వతంత్రునిఁ జేసిన నిరు
1 పమాన శాంతచిత్తుఁ డీయద్దూరహిమాను. భౌమాసాహి శీలము ప్రతాపసింహుని శీలమున
కెనయనఁ దగును. కవిత్వము కేవలము భావ ప్రధానమైనదేకాక ఘట్ట ఘట్టమును గర