2023-08-17 09:21:09 by ambuda-bot

This page has not been fully proofread.

9
 
యం దీ కవిసింహునకుఁగల భక్తి-గౌరవములు తొలుకాడు చున్నవి. ఎచ్చటఁ జదివినను
జదువకుల హృదయములు కరఁగి నీరుగాక మానవు. ఎంతటి దేశద్రోహులైనను దేశ
భక్తులు మాఱక మానడు. ఇట్టి విశేషములు వివరముగఁ దెలుపఁబూనిన నిది యొక
గ్రంథమంత యగును.
 
నిడుదవోలు.
 
మంగిపూడి వెంకటశర్మ.
 

 

 
గీ॥ మొగముముందఱి యిచ్చక మ్ములకు దిగక మనసులో మాట వల్కు పేశీ మంచిదేని
నామతంబున వీరరా + ణాపతాపచరిత గమగమల్ పైఁ జిమ్ము జాజిపువ్వు;
కప్పురపుఁ బల్కు పొదిగిఁటఁ
కుదుపు టొరపిళ్ళ సుడియక
చిదుమఁగారాని రసమొదుఁ
 
గవిసికొన్న వింతయేడాకులరఁటి బాలెంతరాలు!
కుదురునడల నిండుకొని పాఱు నెలఁదోఁగనీటికాల్వ !
జిందువాఱ గింజ లలమని కమ్మనా రింజ పండు;
తీర్పు మార్పుల నంది పందిరులఁబోక యనువుమై నల్లు నవకపు టడవిమల్లె
చిఱునగవుఁదేలు చిటిపాప చిన్ని మోము సిగ్గుఁఱనాడు ముగుద కుచ్చితపుఁజూపు!
నలఁతవోని కుచేలు ని ల్లాలిహృదయ! మొడలెఱుంగని వీరు క ట్టడి కటారు!
విధులు నవ్వు వసంత వా సరములందు : జలకమాడి చల్వలు గట్టి కలప మలఁది
ప్రొద్దుట 'షికారు' వెడలు మారుతమువోలె నందుఁగాత వికృతి జన స్వాగతమ్ము !
 
ప్రొద్దుటూరు.
 
17-12-1933
 
విద్వాజ్ కవిసింహ అవధానిపంచానన,
గడియారము. వెంకట శేషశాస్త్రి
తెలుఁగు పండితుఁడు. మునిసిపల్ హైస్కూల్,
 
గీః కాలకుహరమ్మున బిట్ట కతల ముచ్చమునిఁగి తనుఁగు ప్రతాపసిం హుని చరిత్ర
నీకలము యోగదండమై నీవచస్సు జీవనద మంత్రమై చిరంజీవిఁజేసె.
అమృతబీజాక్షరమ్ముల 4 నామహాత్ముకతకుఁ బ్రాణమ్ము వోసిన శ్రీ కవివి! రాజ
శేఖరా! నీసమాఖ్య సుస్థిరతఁగాంచె ధన్యతమమయ్యె నీకవితా ప్రవణత!
తళుకు నగిషీలు లేక ముస్తాబు లేక, చికిలి చిత్తరి జిలుగు బచ్చెనలు లేక,
మెఱుఁగు మఱుఁగులు, గులుకుల మురువు లేక, కసరతులు పల్లటీల్ లేక, గతి మలఁపక,
తాత ముత్తాతనాఁటి ఛాందసములేక పాత కొత్తల నడిమిత్రోవల ఘటించి
వస్తువునకౌ పదార్థ సం పత్తిఁ గూర్చి వ్రాయఁబడినది ప్రకృతిప బంధ మిద్ది!
సానఁదీరిన మెఱుఁగు వజ్రాలమాలఁబోలు: సారళ్యమున నీపదాలచాలు;