2023-08-17 09:21:09 by ambuda-bot

This page has not been fully proofread.

స్వామ్యంబుల్ నశియించె! నిట్టియెడ దు స్సాహిత్యధూమ్యాకుల
భ్రామ్యజ్ఞతికి నీతా పకృతి దీవ్యజ్యోతియై ద్యోతిలుక్!
చ॥ తఱచిన భారతంబొకఁడు తక్క నిజానకు వీర కావ్య మీ
వఱ కుదయింపలేదు మనవాఙ్మయమందొకఁడైన; జాతికి
బరువము మాతృదేశమున భక్తి మదిక్ బురికొల్పి నేఁటి కా
తఱుఁగు భవత్ప్రతాపుచరితంబునఁ దీఱినదోయి! మిత్రమా!
మ। పరమాభ్యున్నత భావపర్వత పతద్వాగుంభ గంభీర ని
ర్ఘరవీచీ రసధారఁ గావ్య సరసిక్ సంధించి ఛందఃపరం
 
పరలక్ కాల్వలు జాలువార్చి తెలుగు మాగాణి జాతీయకా
వ్యరసారామము వెంచితోయి! కవిసిం హా! కావ్యపంచాననా!
సీ! అలచిత్రకారు రంగులమాఱి రాణాప్రతాపసింహక్ష్మాపు రూపపటము
ననరాదుకాని; నీ । యమృతాక్షరన్యాసమూర్తిముం దది వెఱ బొమ్మమాత్ర!
బ్రహ్మకల్పముదాఁక . వన్నెమాయనియట్టు లాత్మయ కొలిమి మీ రాగ్ని బలిమి
కవనంపుమూసలోఁ 4 గఱఁగి మేల్సీసాన జాతీయ తాముద్ర . పోతపోసి
 
గ్రీ వీరరాణావతాపరా డ్విగ్రహమును దెనుఁగుఁగోవెలఁ బ్రాణప్రతిష్ఠ చేసి
నిలిపితివి! చేరి మనసారఁ గొలుచు నాంధ్ర వీర సంతతివాంఛ లీ డేరుఁగాక.
 
కాళహ సి.
 
4-9-34
 
కవితాకళానిధి: బలిజేపల్లి లక్ష్మీకాంతకవి.
 
ఆధునికులగు తెలుఁగు కవులకు దేశభక్తి-దేశాభిమానములు శూన్యములు. వారి
గ్రంథములలో దేశప్రబోధకములగు రచనములు తక్కువ. చారిత్రాత్మకములు కడుంగడుఁ
దక్కువ. చరిత్రాత్మకములై దేశభక్తి నుద్దీపింపఁజేయు పద్య కావ్యములు లేనే లేవు.
వేలసంఖ్యను మించిన తెలుఁగు కవులలో దేశమును దలఁచుకొనువా రరుదు. భావకవుల కీ
గొడవ పట్టనేలేదు.
 
ఈ సుకవి కవిత్వము రసవంతమైనది. శైలి మధురమైనది. ధార గంగా ప్రవాహ
వేగముగలది, పదములు పొందికయు భావగౌరవమును మిక్కిలి మెచ్చఁదగినవి. జాతీయ
ములును లోకోక్తు లును తమంత వచ్చి మూఁగి పడినట్లున్నవి. ప్రతిఘట్టమునను బ్రతి పద్య
మునను గవికిఁగల దేశభక్తియు, శూరశిఖామణి యగు పతాపసింహమహారాజసింహుని