2023-08-17 09:21:08 by ambuda-bot

This page has not been fully proofread.

5)
 
చ। పలుకులఁ దేనె లుట్టిపడు!
భిలు! వినువారి వీనులకు
య్యిలఁ చుల లేదు నీకవిత
దలలఁ గదల్పఁజేయు విబు
 
కడప.
 
23-12-1933.
 
7
 

 
భావములందు స్వతంత్య్ర దీప్తి శో
విందు లొసంగు కథావిధాన! మి
యెతయుఁ దిక్కన భారతం బె! యాఁ
ధపరికరంబున కంచుఁ దెల్పెదళ్.
 
మైసూరు.
 
30-8-34
 
కావ్యపురాణతీర్థ, విద్వాజ్,
జనమంచి వెంకటసుబ్రహ్మణ్యశర్మ,
ఆంధ్రోపాధ్యాయుఁడు.
 
పరశ్శీతప్రణమములు:
 
తమ రచన చాల గొప్పది. ఒకానొక కాలమున నేనును ప్రతాపరాణా చరిత్రమును
పద్యకావ్యముగ వ్రాయ నుత్సాహపడి యుపక్రమించి యుండినవాఁడను. సుమారు 300
పద్యములు వ్రాసి నడుమంత్రమున వదలితిని. వాఁత గ్రంథము గూడ నా వద్ద లేక నశించినది.
తమ గ్రంథముఁ జదువ మొదలిడఁగానే నా ప్రయత్నము నిరవశేషముగా నశించుట
యెతో మేలే యాయె ననిపించినది. ఇంత గొప్ప గ్రంథమును ఒక టేధారతో అందదుకులు
తొడుకులు లేక రచించి ముగింపఁగల్గిన తమశక్తి సామర్థ్యముల కాశ్చర్యపడి యభినందించు
చున్నాను. తమిది ప్రబంధముల పక్వతతోఁ గూడిన పురాణశయ్య. ఈ శైలిలో నిజ
ముగాఁ దా మొక పురాణమునే వాసియుండిన నెట్లుండెడిదోయని యాశపడుచున్నాను.
ఈస్థితిలో నీకావ్యము నింతర సవంతముగాఁ బఠనీయముగాఁ జేయశక్తులు చాలమంది లేర
నుట నిస్సందేహమైన విషయము. ఎక్కువ విన్నవింపలేను. యధావకాశముగా గ్రంథ
మును బూగ్లిగాఁ బఠింతును.
 
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
 
శా॥ భావాభ్యున్నతి, దానికి కొదగిన
రూపన్యాస మద్దానికిక్
లావణ్యంబిడు సుప్రసాద గుణలీలల్ దానికి సత్కళా
జీవంబౌ రసమాధురీమహిమము శ్రీ సిద్ధించి నీకావ్య వి
ద్యావైశద్యము పండెనోయి! కవిసిం హా! నీకు బ్రహ్మాయు వౌ.
శా॥ సమ్యగ్వాఙ్మయ పద్ధతినడదు భాయోషకు నీచపుం
గ్రామ్యంపుంబడి దాపరించె: విమల ప్రాచీకళాసూచక
 
1