2023-08-17 09:21:28 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రథమాశ్వా స ము.
 
మ్మృగ సంతానముల౯ క్షణంబునను భూమిక్ గూల్చి పెక్కింటి గు
ప్పగఁ దా మొక్కెడఁజేర్చి రారుధిరముల్ పాఱంగఁ బెన్కాల్వలై.
చ॥ అరిది ముదంబు మీఱ మృగ యారతి సాగఁగఁజేసి నిల్పి స
త్వరముగ లెక్క సేయఁగఁ బ్రతాపుఁడు గూల్చు వరాహపంక్తి యం
దఱు సమయించు నమ్మృగవి తానము మీఱుటఁ జూచి హర్షముల్
వఱలఁగ మంచి కాలమది వచ్చు' నటంచుఁ దలంచి రందఱుక్.
మ!! శివుముత్తెదువ ప్రీతి కేకలముల జెండాడి చెండాడి యో
 
ధవితానంబులు నూతనోత్సవసముద్యత్స్వాంతులై భూమియుక్
దివియుక్ గ్రక్కదలంగ నార్చుముఁ గడు దేజంబు దీపింప ను
గ్రవనంబు౯ విడి రాజధానిని జొరం గాఁబోయి గొక్కుమ్మడి.
సీ॥ చిత్తూర్పురము శత్రు చేఁబడి రాజ్యభాగము తద్ద పెద్దదిగాక యున్నఁ!
దమదేశసామంత । ధరణీశు లొక్కరొక్కరు పోయి యక్బరుఁ గలియుచున్నఁ!
గడలేని యుద్ధసంఘర్షణంబులఁ దమ దేశమంతయుఁ బిప్పి తేలియున్నఁ!
బరిపంథియో నభో 4 భాగ భూభాగముల్ తలక్రిందు చేసెడు బలియుఁడైనఁ!
 
ను పద్యకావ్యమును
 
దుఁ బ్రథమా
 
శ్వాస
 
ము
 

 
310
 
గీః దమమది హరించు ఘనుఁడు దుర్దాంత తేజుఁ డర్క కులవర్ధనుఁడు సుగుణాంబురాశి
యాప్రతాపుడు రాజౌట హర్ష మొది మించి మిన్నంది ప్రజరమియించెనపుడు.
 

 
గద్య:- ఇది శ్రీమ త్కామేశ్వరీ కరుణా కటాక్ష వీక్షా సమాసాదిత రసవత్కావ్య
నిర్మాణ చాతురీధురీణ, సుగుణగణపారీణ, దుర్భాక వంశ దుగ్గాంభోరాశి
రాకాకైరవమిత్ర, శాలంకాయనగోత్ర పవిత్ర, సుజనజనాను
గ్రహపాత్ర, వెంకటరామార్యపుత్ర, కవిసింహా 2 వధాని
పంచానన కావ్యకళాని రీత్యాదిబిరుద విఖ్యాత, సుకవి
రాజ శేఖర, రాజ శేఖరకవి ప్రణీతంబయిన
"రాణా ప్రతాపసింహ చరిత్రం" బ
 
సంపూర్ణము.
 
341
 
342