2023-08-17 09:21:08 by ambuda-bot

This page has not been fully proofread.

1
 
of
 
గీ1 పక్వమగు తీయమామిడి పండుమాడ్కిఁ బదపదంబున రసముట్టి పడుచునుండఁ
బదియు నెనిమిది వందలు 4 పద్యములను గావ్యముగ వ్రాసి కంటి వ ఖండకీర్తి !
 
గీః సరళముగను జల్లఁగనుర సంబుఁగురిసి తన్మయత్వముఁ గూర్చి గ్రంథంబునడుపు
ప్రజ్ఞ నీసొమ్మటంటి; నా పట్టులందుఁ దిక్కనక మీద్రుఁ దలపించు
+
 
దీప్తిఁగంటి !
కొజ్జబుతి
 
గీ॥ ఉత్తమోత్తమ వీగుల కుండవలయు నుత్తమోత్తమ గుణముల
 
నిల్వుటద్దంబునై యొప్పు నీప్రతాపువీర చరితంబు "రెండవ భారతంబు" !
 
గీః అన్న! నేఁటి మహాసభాధ్యక్షుఁడనయి బారుతీరిన విబుధుల ప్రార్థనమ్ము
 
వఱలఁ "గావ్యకళానిధి" బిరుద మొసఁగు భాగ్యమునుగాంచి పరవశత్వంబుఁగంటి.
జనమంచి శేషాద్రిశర్మ.
 
}
 
(ఆవిష్కరణ మహాసభాధ్యతులు.)
 
ప్రొద్దుటూరు.
 
17-12-1933
 

 
ఎచ్చట నేరసము చిలుకవలయునో అచ్చట నారసము గలదియై, నిర్దుష్టమై,
"రెండవభారత" మన్నంత యంద చందములతో మీకవిత యున్నదని నాకుఁ దోఁచినది.
ఇది సూత్రపాయమైన నా ముఖ్యాభిప్రాయము.
 
కడియం.
 
అనంతపురం.
29-4-34
 
చెళ పిళ వెంకటశా
 
చెళ్లపిళ్ల
వెంకటశాస్త్రీ
స్త్రీ
(తిరుపతి వెంకటేశ్వరులు)
 
నమస్కారములు. తాము సాదరముగ పంపిన "రాణాప్రతాపసింహ" చరిత్రమును
కృతజ్ఞతతో స్వీకరించినాను. దాని నామూలాగ్రముగఁ జదివితి. చరిత్ర గ్రంథమును
కావ్యముగ వ్రాసి రసవంతముగ నిర్వహించడము కష్టమైనపని. మీకథాకథనవిధాన మిప్ప
టీ కద్వితీయమైనదని చెప్పిన అతిశయోక్తి అని తలంపరని నమ్ముచున్నాను. ఇంతటి పెద్ద
కావ్యాల నింతచక్కగ వ్రాయఁగల వా రింక నుండడము శుభావహము. మీకవితాధార చే
తనిసినాను. మీకు ధన్యవాదములు.
 
చిలుకూరు నారాయణరావు,
(ఎం. ఏ. పి. హెచ్. డి.)
 
క॥ చదివిన భారతమేకద చదువంగా వలెనటన్న సామెత వృధయై
పొదలుఁ బ్రతాపచరిత్రము చదివినవారలకు నెందు సత్కవితిలకా!