This page has not been fully proofread.

3
 
మఙ్గళప్రయోజనో భవతి'- యని శాఙ్కర భాష్యము. స్మృతు
 
లందు గూడ-
ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా !
కంఠం భిక్త్వా వినిర్యాతౌ తస్మాన్మాజళికావుభౌ॥ - అని
 
వచింపఁబడియున్నది. కాన, మహర్షి 'అధ శబ్దముతో గ్రంథా
రంభముగావించుట చే సంప్రదాయమును విడువ లేదని వ్యక్త
మగుచున్నది.
 
పాణినీయమ తానుసారముగా వచించెదనని చెప్పుకొను
టలో నాతనికి తనశాస్త్రముపైగల విశ్వాసము, మరియు
నాతని శాస్త్రప్రౌఢీమాప్ర్రామాణ్యములు వ్యక్తములగు
చున్నవి. ఇంకను కవి "శాస్త్రానుపూర్వ" మని వచించి తన
గ్రంధపు ప్ర్రామాణ్యమును స్థిరపరచుచున్నాడు.
 
ఇతరశి క్షాగ్రంథములానాటికే ప్ర్రాచుర్యము వహించి
యుండగా తన యీ నూతన గ్రంథ ప్రణయన మెందులకను ప్రశ్న
యుదయింపక పూర్వమే. తత్పరిహార్థమై - 'యథోక్తం లోక
 
వేదయోః' అని, చెప్పుకొనినాడు. అనగా నితర శిక్షా గ్రంథములు
కేవల వై దిక ములు కాగా తన యీశిక్షా ప్రణయన పద్ధతి వానిక న్న
విలక్షణమై, లౌకిక వైదిక సంప్రదాయములు రెంటికిని సంబం
యాతనిహృదయము లౌకిక వై దిక భాషలకు
పాణినీయశాస్త్రావశ్యకత యిట్టిదని చెప్పబని లేదు. వ్యాకరణ
 
ధించినదని