This page has not been fully proofread.

శిక్షామ్_శిక్షయనఁబడు ప్రథమవేదాఙ్గమును *; ప్రవక్ష్యామి -
విశేషముగా వచింతును; తద్-ఆయది (నా శిక్షణయన
లౌకిక వై దిక సంప్రదాయములందు;
 
పద్ధతి) లోక వేదయోః
 
యథో క్త్రమ్= చెప్పబడినట్లును; శాస్త్రానుపూర్వమ్ = శాస్త్ర
ముననుసరించి యాచార్యులచే పరంపరితముగా ప్రవర్తింప
జేయబడుచున్న యానుపూర్వికలదిగను, విద్యాత్ తెలియ
 
వలెను,
 
2
 
1
 
వ్యాఖ్య:- గ్రంథాదియందు స్వీయగ్రంథముయొక్క
నిర్విఘ్న పరిసమా ప్త్యర్థమై మఙ్గళమాచరించుట మన సంప్ర
దాయము, కాని యార్ష మగు నీగ్రంధము నందట్టి మఙ్గళాచర
ణము గావింపఁబడ లేదు. అంతమాత్రమున మహర్షి సంప్రదా
యము నుపేక్షించెనని పలుకుట పాడిగాదు.
మఙ్గళకరమగు
'అథ' శబ్దముతో కృతులనారంభించు నాచారము గూడ ' మన
స్త్రములందు చూపట్టును. పూర్వమీమాంసాశాస్త్రప్ర్రవ
ర్తకుఁడగు జై మినిమహర్షి
'అథాతోధర్మజిజ్ఞాసా'
 
ప్రారంభించి తన 'ద్వాదశ లక్షణిని' వెలయించెను.
 
*
 
'అధ'శబ్దము మాఙ్గళికమని శ్రీశంకరులు సెలవిచ్చి
యున్నారు. 'అర్థాన్తరప్రయుక్త ఏవ హ్యథశబ్దః శ్రుత్యా
 
శిక్షావ్యాకరణం ఛన్దః నిరుక్తం జ్యోతిషం తథా ।
కల్పశ్చేతిషడజ్గాని వేదస్యాహుర్మనీషిణః ॥
 
యని
 
'అను మనసంపదాయముననుసరించి యనిభావము.
 
3