This page has not been fully proofread.

9
 
వే లొసంగి తెనాలివిద్యాలయానికి
స్ఫూర్తి తెచ్చిన త్యాగమూర్తి యతఁడు
వేనూర్లు వెనుకంజ వేయక దక్షు లౌ
 
కవుల కి చ్చెడుభోజభూధవుఁ డతండు
 
గీ. ఏమి ధర్మార్థసంసక్తి యేమి కరుణ
యేమి విద్యాభిరతిమతి యేమి కావ్య
గౌరవాస క్తి తనుఁ బోలఁ గలుగువారు
వారు వీ రని యెన్నఁగా వేరు గలరు ?
 
33
 
చం. పెదపులివఱ్ఱు సంపదల పెద్దకొటారము దేశమాత క
భ్యుదయముఁ గూర్చు త్యాగధను లుండెడు చోటు మహాగ్రహారమై
యొనరినపుణ్యభూమి ధర నూర్జిత మైన సువర్ణఖండ మ
య్యది తన పూర్వవంశ్యులకు నాశర మతని భాగ్య మెట్టిదో! 34
 
శా. ద్రాక్షారామముల౯ స్వదేశమున నాదర్శంబు గాఁ బెంచి సం
వీక్షం బంటలు పండఁ జేయఁడొకొ ! యుర్వీక్షేమ మీక్షించి మే
లక్షత్వంబున నిర్వహింపఁడొకొ ! బలాన్యంపుగిడ్డంగుల
దీక్షం దా, నిటు దేశసేవ కగు నేధీరుండు లెక్కింపుఁడీ !
 
35
 
శా. విద్యాసంస్థలఁ బ్రోవ నెంచి దినము న్వేల్వేలు వెచ్చించుచున్
విద్యావంతుల నాల్గుమూలలను నన్వేషించి చేపట్టుచున్
విద్యాక్షేత్రములందుఁ జల్లెడిని సద్విజ్ఞానబీజంబులన్
విద్యాపోషణయందు నాతనికి నుర్వి౯ సాటి యాతండ పో ! 36 -