This page has not been fully proofread.

5
 
గీ. లెన బుచ్చయ్యతమ్ముఁడు కృష్ణయాఖ్యుఁ
డనుపమానయశస్కుఁ డీయవనియందు
నాతఁ డెత్తించె వడ్డేశ్వరాలయమున
శ్రీధ్వజ స్తంభ మెంతసుకృతము కృత మెం !
 
గీ, ఆది శేషమ్మగుణము లనాది శేష
 
ములు గఁ బొగడొందె ఫణిపతి పూని తాను
వేయి మొగములతోడను రేయుఁబగలు
 
వర్ణనలు చేయ ముగియక పరఁగుకతన.
 
గీ. సందెవేళల నాది శేషమ్మ సాధ్వి
 
సందెదీపంబు వెట్టుచు సందెపాట
పాడుచో శ్రీమహాలక్ష్మి యాడుచుండు
నాట్య మాయింట నెపుడు నానండిపడుచు,
 
సీ, గోవాడ రామయ్యగుడిశిఖరంబుల
 
నెలకొల్పే సుకృతంబు నెలవుకొ ల్పై
విష్ణ్వాలయంబున విగ్రహంబులు నిల్పె
 
నమర విపుల నగ్రహారముల నిలిపె
స్థల మిచ్చె నమెరికాస్పత్రి స్థాపింపంగ
 
నెకరంబు లైదు కీర్తి కిని నెక్క
నిర్మించెఁ దన పేర నిడుఁబ్రోల నొక చెర్వు
తరతరంబులఁ దన్నుఁ ఁ దలఁచునట్లు
 
18
 
19
 
20