2023-07-29 17:16:09 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
18.
 
19.
 
21.
 
ఇంద్రాణీ స ష్తశతీ
 
సర్వగుణములు, 'సర్వ తేజస్సులు, సర్వబలములు గల్గి సర్వ
జగత్తును వ్యాపించి, ప్రకాశించు నొకానొక ఉత్కృష్టమైన
దానవు నీవు.
 
22.
 
83
 
20. ఈశ్వరుడే కారణమని చెప్పువారి కామె పరమమైన మాయ
యగుచున్నది. సాంఖ్యవాదుల కామె ప్రకృతియై, యోగులకు
 
కుండలినీ యగుచున్నది.
 
ఓ తల్లీ ! ఆకాశ శరీరిణి వైన నీవు శరీరములేని సద్వస్తువునకు
భార్య వైతివి. యుక్తిగల పండితులచే నీవు మహేశ్వరివని చెప్ప
 
బడుచుంటివి.
 
'పంచదశి' యను నుత్తమ విద్యను జపించువారి కామె లలిత
యగుచున్నది. శ్రేష్ఠమైన నవార్ణమంత్రమును భజించువారి
కామె చండి యగుచున్నది. (నవార్ణమంత్రములో 9 అక్షరము
లుండును. అర్ణము అనగా వర్ణము.)
 
ఆ చండి శచీ దేవియొక్క ఉత్తమమైన కారణరూపమై
సంతోషముగొఱకును, కార్యశరీరమై స్వర్గమం దింద్రుని
సంతోషముకొఱకును ప్రకాశించుచున్నది.
 
నా
 
23. వ్యోమమే శరీరముగాగల యీ మె సర్వజగత్తులయొక్క చాలన
సూత్రమును వశ మొనర్చుకొని తిరుగ (సృష్టి) నిర్వహించుటకై
దివ్యతనువులుగల స్త్రీశ్రయమగుచున్నది.
 
24. ఓ తల్లీ ! చిరకాలమునుండి జయములేని ఈ స్వకీయ దేశమును
రక్షించుటకు యీ సేవకుని భయరహితునిగాను, సమర్ధునిగాను
 
జేయుము.