2023-07-29 17:16:08 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
23.
 
24.
 
25.
 
1.
 
2.
 
3.
 
4.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ ! నీ యాత్మవిభూతులే యగు మనోభావములతో నీవు
కూడి శక్తివై యుంటివి. శక్తుడైన మహేంద్రున కీ విభూతులు
ప్రతిబింబములవలె అంతరమున నున్నవి.
 
22 502
 
77
 
గణపతిముని శరీరమందు బ్రవహించు సనాతనమైన శక్తి
బాధపడుచున్న భారతభూమిని రక్షించుగాక.
 
63
 
వాసిష్ఠ మునియొక్క తత్వవాదములగు నీ ' పథ్యా వక్త్ర '
వృత్తము లనంతమైనట్టి, పుట్టుక లేనట్టి చిత్తును సేవించుగాక.
 
16
 
అత్యంత సామర్ధ్యముగల ఇంద్రాణీ మందహాసకాంతి నామనః
పథము నావరించి జయింపనలవిగాక యున్న అజ్ఞానాంధకార
 
మును హరించుగాక.
 
దుర్దశచే క్షీణించిన శరీరముగల భరతభూమి యను కాంత
యొక్క యేకధారగా స్రవించు కన్నీటి నింద్రాణి హరించుగాక.
 
రాక్షస సమూహమును దండించునది, పండితులచే కీర్తింప
బడునది, యింద్రుని గృహమున కలంకారమైనది, పాపములను
ఖండించునదియైన వనిత ప్రకాశించుచున్నది.
 
సద్గుణసంపత్తికలది, సర్వశరీరమునందు సుందురమైనది, ఇంద్రుని
పుణ్యఫలమగునదియైన దేవి నా బుద్ధిబలమును వృద్ధి జేయుగాక.