2023-07-29 17:15:56 by ambuda-bot

This page has not been fully proofread.

iii
 
అటుపిమ్మట గణపతి మునియందు రేణుక యను నామాంత
రముగల ఇంద్రాణి ప్రత్యేక కృప జూపజొచ్చెను. వైదిక దేవతయైన
యీమె కృపవలన వేదహృదయ భేదజ్ఞానము, శ్రీరమణుని యుప
దేశమునకు కవచమగు నొక వేదమంత్ర దర్శనము, తపఃపరిపాకమందు
క్రమముగా కపాల భేదనమను సిద్ధిచే నమృత ప్రాప్తిని గణపతిముని
పొంది, ఋగ్వేదఋషివ లె బ్రకాశింప జొచ్చెను. అట్టి యపూర్వ కటాక్ష
మును బరపిన ఇంద్రాణి నుద్దేశించి 1922సం॥లో కపాలభేదనమైన పిదప
రచింపబడిన స్తోత్రకావ్య మే
'ఇంద్రాణీ సప్తశతీ'. దీనికి ఫల
ముగా మన దేశమందప్పుడు పాలించుచున్న పరదేశ ప్రభుత్వమునుండి
విముక్తిని, దేశస్థులందు వేదమకదృష్టి నిచ్చి వారియందు వీర్య తేజోభి
వృద్ధిని యర్ధించెను. ఉమా సహస్ర పారాయణమువలన తప ప్రబోధ
మిగుటకు సంకల్పించినట్లే కవి దీని పారాయణమువలన నంతర్భాహ్య
శత్రువర్గ నాశనమును సంకల్పించెను.
 
యీ
 
A
 
ఉమాసహస్రములో వలెనే దీనియందును 25 శ్లోకముల
నొక్కొక్క స్తబకముగా కూర్చి, యొకొక్క స్తబకము నొక్కొక్క
ఛందస్సుతో రచించెను. మఱియు, నొక్కొక్క శతకమున కొకొక్క
వైదిక ఛందో నామమిడి, కవి వై దిక దేవతను సార్థకము చేసెను. అది
గ్రీష్మఋతువైనను ప్రతి దినము రచనాంతమందా దేవత మెఱుపుల
నాకసమందు గల్పించి తన సంతోషమును జూ పెను,
 
అట్టి యీ పవిత్ర గ్రంథమును ప్రచురించు భాగ్యము నాకు
చేకూరినందుల కింద్రాణీ దేవతకు, నామెకు పుత్రులైన శ్రీ రమణ
గణపతులకు నేనెంతయు కృతజ్ఞుడను.