2023-07-29 17:15:55 by ambuda-bot

This page has not been fully proofread.

ii
 
అది కావ్యకంఠుని
 
స్రవించుట కప్పటికి నిర్ణయమయ్యెను కాబోలు !
పై నేకాక ఆ క్షేత్రమున పండ్రెండు సంవత్సరములనుండి నిరంతర తపో
మగ్నుడైయున్న నొక బ్రాహ్మణస్వామి పై కూడ స్రవించెను. ఆ కృప
చొప్పున బ్రాహ్మణస్వామి నాశ్రయించి శంక దీర్చుకొనుటకు కావ్య
కంఠు డొకవంక ప్రేరేపితుడై, యింకొకవంక చిరకాల మంతర్దృష్టి
యందున్న కారణమున వాగ్రస ప్రవాహములేక శుష్కించిన కంఠ
నాళములచే బద్దకంఠుడైన బ్రాహ్మణస్వామి ముక్తకంఠుడై తన కనుభవ
సిద్ధమైన నూత్న మార్గముచే తపస్స్వరూపము నుపదేశించుటకు
 
A pe-
ప్రే రేపితుడయ్యెను.
 
ఉపనిషత్తుల్య మైన
 
సవ్యోపదేశము చే కావ్యకంఠుడు
 
కృతార్థుడై, తనకు ప్రాప్తించిన సిద్ధగురుని పూర్వాశ్రమ నామమును
సంస్కరించి యతినికి భగవాన్ రమణమహరి యను పేరుంచి యంగీక
 
'సరే నాయనా' యని పల్కి గురువంగీకరించుట
 
రింవ వేడెను.
 
'నాయన' యను క్లుప్తనామము గణపతిమునికి ప్రసిద్ధమయ్యెను. అటు
పిదప నీ యుప దేశ సందర్భములను సమకూర్చిన యుపనిష దేవతయగు
'ఉమ' నుద్దేశించి, 'ఉమా సహస్ర' మను స్తోత్రకాన్యమును పంచ
దశాక్షరీ మంత్రబద్ధముగా రచించి, దానియం దీ నవ్యోపదేశముచే
కర్మ - భ క్తి - యోగ - జ్ఞాన మార్గములు సంస్కరింపబడిన తీరును
 
-
 
-
 
పెను. ఆ స్తోత్రఫలముగా తన దివ్యదృష్టిచే శ్రీ రమణునియందు
గాంచబడిన కార్తికేయాంశను ప్రస్ఫుటము గావించి, దానిచే లోక
మందిప్పుడు వక్ర మైయున్న బుద్ధిని సంస్కరింప వేడెను. ఈ ఫలము
వెంటనే సిద్ధించి, ఆఱు నక్షత్రరూపములుగా నొకా నొక దివ్య తేజ
స్సాకాసమునుండి వ్యక్తమై శ్రీరమణుని బొందుట కావ్యకంఠునితో
పాటక్కడివారు పెక్కుమంది తిలకించి ధన్యులయిరి.