2023-07-29 17:16:05 by ambuda-bot

This page has not been fully proofread.

ఇంద్రాణీ స ప్తశతీ
 
8. పాపరహీతకిరణములకు నిధియగు నేదేవి తన కాంతి లేశము చే
గల్పించిన దీపమువల్ల గృహమునందలి (అనగా విద్యుద్దీపము)
చీకటిని నశింపఁ జేయుచున్న దో,
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
59
 
ఏ దేవియొక్క కాంతినుండి యొక్క కిరణమును బొందిన మెఱుపు
యీ మేఘమ నెడి సౌధతలమందు మాటిమాటికి సొగసును
స్ఫురింప జేయుచున్న దో,
 
ఏ దేవియొక్క కాంతినుండి స్వల్ప భాగమును బొందిన వజ్రము
శత్రునాశన మొనర్చు నాయుధములలో మేటిపదము బొందు
చున్నదో,
 
ఏ దేవియొక్క కాంతిలోని యణుకమాంశనుబొంది, స్త్రీల
యొక్క నగవు కాంతి యువకుల మనస్సుల మదింపఁ జేయు
చున్నదో,
 
గొప్పదైన ఆకాశమందు వ్యాపించిన సూక్ష్మ దేహముగలది,
పరమపురుషుని బ్రకాశింపజేయు చిద్రూపిణియునగు ఆ శచీ దేవి
 
నాకు శరణము.
 
ఇంద్రసఖయు, కాంతులకు నిధియైన ముఖము గలదియు,
అమృతమును వర్షింపజేయు చూపులుగలదియైన శచీదేవి నాకు
శరణము.
 
నిత్యనువాసిని, సదాయౌవనముగలది, పాపరహితులైన వీరులు
పుత్రులుగా గలదియైన శచీదేవి నాకు శరణము.