2023-07-29 17:15:55 by ambuda-bot

This page has not been fully proofread.

మ న వి మా ట
 
--
 
SH
 
'ఇంద్రాణీ సప్తశతీ' యను నీ గ్రంథము మహత్తరమైన స్తోత్ర
కావ్యము. దీనిని రచించిన కావ్యకంఠ శ్రీవాసిష్ఠ గణపతిముని
యాంధ్రుడు. బొబ్బిలికి సమీపమందున్న కలువతాయియను గ్రామము
నివాసముగా గల్గిన తల్లిదండ్రు లీయన జన్మించుటకు పూర్వము పొందిన
కొన్ని దివ్య దర్శనములచే నీయన తమ యిష్ట దైవమగు గణపతియొక్క
యంశసంభూతుడని విశ్వసించి యీయనకు గణపతి యను పేరిడిరి.
వారి విశ్వాసమునకు తగిన ప్లీయనయం దసాధారణ ధీవిక్రమము,
వాక్సిద్ధి, యాశుకవితా ప్రజ్ఞ మొదలగు దివ్యవిలాసములు బాల్యమందే
ప్రస్పుటమగుట జూచి తమ విశ్వాసమును ద్రువపరచుకొనిరి. కాని,
బాలగణపతి వారి నమ్మకమును కాదనుకున్నను తన కా దైవాంశానుభవ
మాంతర్యమున గల్లకుండుట గుర్తించుకొని, తత్రా ప్తికొఱ కీశ్వరాను
గ్రహమును "సాధించుటకు పదునాఱవ యేటనుండి తపస్సును బూనెను.
 
అత్యంత భక్తిశ్రద్ధలతోడను, శాస్త్రములనుండియు పెద్దలవల్లను
గ్రహించిన విధివిధానములతోడను నాచరింపబడిన యీ తపస్సునం
దచిరకాలములో నే భువనేశ్వరీ యనుగ్రహమున దివ్యనాగ్రస ప్రవా
హమును, ఈశ్వరానుగ్రహమన నిర్విషయధ్యాన యోగమును బడసి
నను దృప్తిజెందక తన తపస్సునకు ఫలముగా నిజతపస్స్వరూపానుభవ
మునే కాంక్షించుచు సుమారు పండ్రెండు సంవత్సరములు పాటు
పడెను. కాని లక్ష్యము సిద్ధించలేదు. అప్పుడు వేదశాస్త్రభాష్యము
లందును, పురాణేతిహాసములందును పేర్కొనబడిన తపఃపదనిర్వచన
 
ములనే శంకించుకొని, దాని యదార్థమును తర్కించుకొనుచుండగా
నొక ప్రేరణము బొంది యరుణాచలక్షేత్రమున
 
1907 సం॥లో
 
కృత్తికోత్సవముల సమయమునకు ధ్యానదీక్ష బూనెను. ఈశ్వరకృప