2023-07-29 17:16:05 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
18.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
24.
 
25.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
దేవీ ! స్థిర భక్తితో స్ఫటమైన విజ్ఞానముతో నిన్ను భజించు
వారుకూడ నీ కటాక్షమును బొందుదురని వేతే చెప్పనేల?
 
ఓ శచీ ! దురదృష్టమువలన నిన్ను మరచిన భారతభూమి చాల
కాలమునుండి అయోగ్యమై, యభాగ్యదశకు పతనమయ్యెను.
 
55
 
అభిషిక్తుని తల్లియై (విక్టోరియా రాణి), నీ తేజోంశవలనజన్మించిన
యామె తనను సేవించు పశ్చిమవాసులను మంచి దశకు
తెచ్చెను.
 
ఓ యింద్రాణీ ! ఎంతకాలము పశ్చిమ దిక్కుపట్ల దయగా
నుందువు. ఈ దీనురాలైన పూర్వదిక్కును చూడుమా.
 
ఓ శచీ ! మేము పశ్చిమదిక్కు యొక్క నాశమును యాచించ
లేదు. నిరాశజెందియున్న పూర్వదిక్కును కృపతో రక్షింతువని
 
మాయాశ.
 
ఓ తల్లీ ! ఈ దీనుల విషయమై సమస్తము వ్యర్ధమైపోయెను.
చూడగా, సీ దయయొక్కటి మిగిలియున్న ది.
 
ఓ తల్లీ ! నీవు నరసింహ సూనుడగు గణపతిని భరతభూమి
రక్షణకొఱకు బలముగలవానిగా జేయుము.
 
ఈ హంసమాలా వృత్తములు మనోహరమగు స్వకీయగతుల చే
నింద్రాణిని సంతోషపరచుగాక.