We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:04 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ మాతా! పుణ్యాత్ముడైన వేతొకడు తన తేజస్సుచే శత్రు
వులను బారదోలి, నిజ దేశమును దాస్యబంధమునుండి విడి
పించుచున్నాడు. (గాంధీమహాత్ముడు.)
 
53
 
ఓ యింద్రాణీ ! సాధువైన మఱియొకడు విశ్వమును మరచి
యానంద బాష్పములచే తడుపబడిన చెక్కిళ్లతో క్రీడించు
చుండును. ఆశ్చర్యము ! (అరవిందుడు)
 
ఓ దేవీ ! నీ యనురాగ దృష్టిచే స్వర్గమందు దేవేంద్రునకు
నాట్యము, నీ కరుణార్ద్ర దృష్టిచే భూమియందు భక్తునకు
నాట్యము అగును.
 
నీ దృష్టి ప్రేమతోగూడి యింద్రునకు బలమిచ్చును, కారుణ్య
ముతో గూడి మాకు బలమిచ్చునుగాక.
 
నీ వామ (వక్ర,రమ్య) కటాక్షము లింద్రుని యానంద పర చును.
నీ దక్షిణ (ఉదార) కటాక్షములకు ఈ జను డుచితుడగుగాక.
 
కరుణతో బ్రకాశించు నీ చూపు మా పుణ్యముల నభివృద్ధి
పరచి, మా పాపములను క్షయము చేయుగాక.
 
ఓ శచీ! విజ్ఞాన తేజస్సును బ్రసరింపజేయు నీ చూపు నీ పాదా
బ్దములను నమ్మియున్న నా మార్గమును తమస్సు లేనిదిగా
నొనర్చుగాక.
 
ఓ తల్లీ ! భువనమందుగల నీ విభూతులను క్రియచే నారాధించు
కొందఱు నీ కటాక్షము నీ లోకములోనే పొందుచున్నారు.