We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:04 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
4₁. అమృతమును సృష్టించునట్టిది, మంగళములను నిర్మించునది,
పాపములను ధ్వంస మొనర్చునది, విజ్ఞానమును బోషించునది,
 
5.
 
6.
 
7.
 
8.
 
9.
 
51
 
దేవేంద్రునకు సంతుష్టి గలిగించునది, నియమము గలవారికి
కామ ధీరువు ( దేవగృష్టి) వంటిదియైన నీ దృష్టి నా కోర్కెలను
దీర్చుగాక.
 
ఓ తల్లీ ! నీ నల్లనైన కటాక్షము భక్తులనెడి నెమిళ్ల నాట్యము
కొఱకు మేఘమగుచున్నది.
 
(కారు మేఘము నెమిళ్లకు ప్రీతియై నాట్యమునకు బ్రే రేపించును.
భక్తులు నెమిళ్లతోడను, దేవీ కటాక్షము కాటుక కంటి సంబం
ధమై కాసమేఘముతోడను పోలిక.)
 
(
 
ఓ మాతా ! విస్తారమైన ఆ నాట్యములో నొకానొక పుణ్య
పురుషుడు జగత్తుకొఱకు శ్రేష్ఠమైన ఉపదేశము జేయును.
(ఇది దేవీ కటాక్ష, ప్రేరణమున చేయబడునని భావము. శ్రీరమ
ణోప దేశమును కవి ధ్వనింపజే సెను. )
 
ధన్యుడగు మఱియొకడు పండితుల యాస్వాదము కొఱ కప్రయ
త్నముగా ననింద్యమైన నూత్న కావ్యములను రచించును.)
(కవి తనయం దా దేవీ కటాక్షము బొందిన కార్యరూపమును
బేర్కొ నెను.)
 
భాగ్యశాలియైన నింకొకడు రమ్య ప్రసంగములచే జగత్తునందు
తమ జాతివారిని శేషమైన నీతిమంతులుగా చేయును.
(కల్నల్ ఆల్కాటుదొర ధ్వనించుచుండెను.)