2023-07-29 17:16:03 by ambuda-bot

This page has not been fully proofread.

స, 2.
 
16
 
17.
 
18.
 
19.
 
20.
 
21.
 
ఇంద్రాణీ స స్తశతీ
 
దుర్జన దేహమ నెడి గోతిలో మునిగిపోయి, పాపపంకమందు
చిక్కు వడిన ఆత్మసంబంధమగు ప్రాణముల నుద్ధరించుటకు దృఢ
దీక్ష బూనిన వాక్యపూర్తికి తరువాత శ్లోకము చూడుడు.)
 
47
 
ఇంద్రుడు యుద్ధమున నెట్టి వజ్రాయుధము ధరించెనో అట్టి
వజ్రము నీశక్తియొక్క కళచేతనే నిర్మింపబడెను.
 
(శరీరములందుండు వెన్నెముకకు వజ్రదండమని పేరు. దాని
యందు శరీర వ్యాపారమును శాసించు నాత్మశక్తిప్రవాహము
సుషుమ్నానాడి నాశ్రయించి యుండును. ఈ శక్తియే వజ్రా
యుధశ క్తియై, యింద్రుడైన ఆత్మచే ధరింపబడినట్లుండును. దీని
యనుగ్రహము బొందిన యోగికి శరీరమునంటిన పాపములు
నశించి, నాడీగ్రంధులు వీడును. కవికి కపాలభిన్న సిద్ధినిచ్చిన దీ
శక్తియే.)
 
ఓ దేవీ ! నీవు రాజ్ఞి వగుట చేతనే ఇంద్రునకు రాజత్వము కలి
గెను. నీవు లేనిచో నత డశక్తుడై మములు నెట్లాజ్ఞాపించగలడు?
ఓ తల్లీ ! ఇంద్రలోకమందున్న సమస్త విశేషము నీ హస్త
మందే కలదు. ఈ స్తోత్రము మాకుండు బుద్ధిచే సంగ్రహముగా
చేయబడుచున్నది.
 
ఓ తల్లీ ! మార్జాలకిశోరన్యాయమువలె పూర్తిగా నర్పించు
కొనిన శూరుని నీవు భరించుచు గమ్యస్థానము జేర్చుచుంటివి.
(భగవాన్ శ్రీ రమణమహర్షి యుదేశింపబడెను.)
 
ఆకాశమునకు ప్రభ్వివి, తల్లివి యైన నిన్ను విడువని పట్టుతో
గ్రహించుచున్న యోగి మర్కట కిశోర న్యాయమున గమ్య
స్థానము చేరుచున్నాడు. (స్వానుభవమును కవి పేర్కొ నెను)