2023-07-29 17:16:02 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 
39
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఆకాశమందు బ్రకాశించు నీ కితర శరీరధారియగు
తండ్రి యెవ్వడులేడు. అట్టి నిన్ను మే మందువలన స్వయం
 
భువగా తలచుచుంటిమి.
 
ఓ యీశ్వరీ ! రాక్షసకులమందు బుట్టిన పులోముడు నీ తండ్రి
యను కవివచన మప్రమాణమైనది.
 
(పురాణములలో పులోము డింద్రాణి తండ్రిగా వచింపబడెను)
 
దేవీ ! జలయుక్తమైన మేఘ మీ యసురవాచక శబ్దములతో
పిలువబడెను. అట్టి పదములలో 'పులోమ' పద మొకటి.
(ఘనం అనగా మేఘము. నిఘంటువులో 'ఘనం' అను పద
మునకున్న 32 పేళ్లలో 'పులోమ' అనునది యొకటి.)
 
ఓ తల్లీ! మునులకు గీర్తినిచ్చు నీవు అత్యధిక కొంతియు,
గంభీరనాదమున్ను గలిగిన మెఱుపు రూపమున యీ మేఘము
నుండి పుట్టితివి.
 
(కనుక పులోము డామెకు తండ్రి యనబడెను. కాని మెఱుపు
రూపమైన విద్యుచ్ఛక్తి పులోముడను మేఘునకు బూర్వ
మా కాశమందు తల్లివలెనున్న విషయమీ కవులు మరచిరి.)
 
ఈ పులోమ రక్కసుడు నీ విభుని శత్రువుగా వచింపబడు
చుండెను. నీ తండ్రియైన యీ మేఘము 'హయ' మనియు
 
పిలువబడెను.
 
దేవీ ! విూ యుభయులను గుఱించి (ఇంద్రయింద్రాణీలగురించి)
ప్రియమైన గూఢవాన్జాలముచే మునిగణము లీభూమిని వంచించి
నట్లున్నది.