2023-07-29 17:16:02 by ambuda-bot

This page has not been fully proofread.

..
 
1. ఇంద్రాణియొక్క చంద్రునివంటి ధవళ స్మితము నా బుద్ధికి
నైర్మల్య మొసగి శ్రేష్ఠబలము నిచ్చుగాక.
 
3.
 
2. శత్రునాశన మొనర్చి, భరత భూమిని మంచిదశకు తెచ్చి
యింద్రాణి సంతోష పెట్టుగాక.
 
4.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
5.
 
35
 
7.
 
తన పాదములందు నమ్రులైనవారిని రక్షించు విధానమందు
దీక్షబూనినది, జగత్తును భరింప సమర్ధురాలైనది యగు పరా
శక్తి ప్రకాశించుచున్న 9.
 
స్వర్గమం దెశ తెరపిలేకను. ఆకాశరంగస్థలముందు సూక్ష్మము
గాను గల ఆ యింద్రాణీశక్తి యధికముగాను, సూక్ష్మము
గాను బ్రకాశించుచున్నది.
 
(స్వర్గమందు స్పష్టముగా నున్నందున తేజస్సధికము. ఆ తేజము
ఆకాశమందు తన సూక్ష్మత్వముచే తిరోధానమై యస్పష్టముగా
 
నుండును.)
 
ఓ తల్లీ ! నీ యతిసూక్ష్మ తేజస్సు జగత్తునందు సకలానుభవము
లకు నిదానము (ఆధారము) అగుచున్నది.
 
6. ఓ తల్లీ ! అనుభవములయొక్క జ్ఞాన పరిణామమునకు నీ స్వర మే
మూల మగుచున్నది. (ప్రణవ శబ్దము జ్ఞానమునకు నేతకనుక)
 
ఓ యీశ్వరీ ! ఏ స్వరము సమస్త జ్ఞానమునకు మూలమో,
ఆ స్వరమే గతివి శేషమువలన కాలమగును గదా !