2023-07-29 17:16:00 by ambuda-bot

This page has not been fully proofread.

13.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 
19.
 
20.
 
21.
 
4.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
క్షేత్రములందు, బీజములందు గూడ వ్యర్ధముగాని శక్తులను
ధరించు పరా దేవియైన శచి నా దైవము.
 
29
 
ACTR
 
ఒక్క తెయైనను జీవరాసులందు వెతకుట, పచన మొనర్చుట,
నాశన మొనర్చుట యను సంసారత్రయముగా నున్న శచీదేవి
నా దైవము.
 
దృష్టియందు ధరింపబడు చిత్స్వరూపిణి, దృశ్యములందు గోచ
రించు గుణరూపిణి యగు దేవేంద్ర భార్యయైన శచి నా దైవము.
 
పూర్ణ చంద్రునివంటి ముఖము, పద్మముల బోలు నేత్రములు
గలిగి స్వర్గమందుండు నొకానొక స్త్రీ యైన శచి నా దైవము.
 
స్థాణువులందు, చరవస్తువులందు సర్వత్ర వ్యాపించుఇంద్రాణి
నాకు ప్రత్యక్ష మగుగాక.
 
ఓ తల్లీ ! యే యనృతము (నాచే) పొందబడెనో, పలుక బ డెనో,
ధ్యానించబడెనో, ఆ నా పాపమును హరింపుము.
 
ఓ యింద్రాణీ ! ఋణమునుండి నన్ను విముక్తుని గావింపుము.
అల్పబుద్ధులు నన్ను నిందించకుందురుగాక.
 
ఓ యంబా ! శత్రువైన వాడు నా సఖ్యమునకు యత్నించుగాక,
గర్వితుడు నన్ను సేవించుగాక.
 
ఓ శచీ! కష్టములను తొలగించి, యిష్టముల నిచ్చుదానవై
నా కిచ్చటగల ప్రియజనులను సంతో షబరచుము